ప్రభాస్ తో మరో సినిమా చేసే ఆలోచన ఉందని డైరెక్టర్ కొరటాల శివ వెల్లడించారు. 'దేవర' ప్రమోషన్స్ లో భాగంగా ఓ ఇంటర్వ్యూలో మాట్లాడుతూ 'ఆచార్య తర్వాత ప్రభాస్, నేను ఒకరోజు కలిశాం. 2 గంటల పాటు ఎలాంటి మూవీ చేయాలనే దానిపై డిస్కస్ చేశాం. బాహుబలి టైమ్ లోనే రాధేశ్యామ్, సాహో కమిట్ అయ్యారు. మేమిద్దరం కలిసి మూవీ చేయడానికి ఎక్కడా గ్యాప్ దొరకలేదు' అని చెప్పారు. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన 'మిర్చి' సూపర్ హిట్ గా నిలిచింది.