ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గేమ్ చేంజ‌ర్‌లోని 'రా మ‌చ్చా మ‌చ్చా' సాంగ్‌లో అన్నీ సంస్కృతుల‌ను చూపించ‌టం కనులపండుగలా ఉంటుంది

cinema |  Suryaa Desk  | Published : Thu, Sep 26, 2024, 07:41 PM

గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ తన కెరీర్ లో మరో బ్లాక్ బస్టర్ కోసం ఉరకలేస్తున్నారు. 'ఆర్ఆర్ఆర్' తో అంతర్జాతీయ స్థాయికి ఎదిగిన ఆయన... శంకర్ దర్శకత్వంలో 'గేమ్ చేంజర్' చిత్రంలో నటిస్తున్నారు. ఈ చిత్రం డిసెంబరులో క్రిస్మస్ సీజన్ లో ప్రేక్షకుల ముందుకు రానుంది. కాగా, ఈ సినిమా నుంచి 'రా మచ్చా మచ్చా' అనే రెండో సింగిల్ విడుదలకు చిత్రబృందం సన్నాహాలు చేస్తోంది. ఈ పాట ప్రోమో ఈ నెల 28న రిలీజ్ కానుండగా, పూర్తి పాటను ఈ నెల 30న రిలీజ్ చేయనున్నారు. ఈ నేపథ్యంలో, చిత్ర దర్శకుడు శంకర్, మ్యూజిక్ డైరెక్టర్ తమన్ చిట్ చాట్ కు సంబంధించిన ఆసక్తికర వీడియోను మేకర్స్ ఈ సాయంత్రం విడుదల చేశారు. ఇందులో శంకర్, తమన్ అనే ఆసక్తికర సంగతులు పంచుకున్నారు. ఇండియ‌న్ సినీ హిస్ట‌రీలో నెవ్వ‌ర్ బిఫోర్ అనేలా ఎన్నో గొప్ప సినిమాలు, పాట‌ల‌ను చిత్రీక‌రించిన స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మ‌రోసారి త‌న మార్క్‌ను గేమ్ చేంజ‌ర్‌లో సెకండ్ సాంగ్ చిత్రీక‌ర‌ణ‌లో చూపించ‌బోతున్నారు. ఏకంగా 1000కి పైగా జాన‌ప‌ద క‌ళాకారులు ఈ పాట‌లో గ్లోబ‌ల్ స్టార్ రామ్ చ‌ర‌ణ్‌తో క‌లిసి డాన్స్ చేశారు. అది కూడా భిన్న‌త్వానికి ఏక‌త్వమైన మ‌న దేశంలోని ఆంధ్ర‌ప్ర‌దేశ్‌, ఒరిస్సా, క‌ర్ణాట‌క‌, వెస్ట్ బెంగాల్‌, జార్ఖండ్ రాష్ట్రాల‌కు చెందిన జాన‌ప‌ద క‌ళాకారులు... ఇందులో భాగ‌ం కావడం విశేషం. స్టార్ డైరెక్ట‌ర్ శంక‌ర్ మాట్లాడుతూ ‘‘గ్లోబల్ స్టార్ రామ్‌చ‌ర‌ణ్‌, మ్యూజిక్ డైరెక్ట‌ర్ త‌మ‌న్‌తో క‌లిసి గేమ్ చేంజ‌ర్ సినిమాకు వ‌ర్క్ చేయ‌టం హ్యాపీగా ఉంది. నేను రామ్ చ‌ర‌ణ్ కోసం ఓ ఇంట్ర‌డ‌క్ష‌న్ సాంగ్ కావాల‌ని త‌మ‌న్‌ను అడిగాను. డిఫ‌రెంట్‌గా చేద్దామ‌ని ఇద్ద‌రం అనుకున్నాం. చాలా సేపు డిస్క‌ష‌న్ చేసుకున్నాం. ఒక‌రి స‌ల‌హాల‌ను ఒక‌రు విన్నాం. ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లోని భిన్న సంస్కృతుల‌ను బేస్ చేసుకుని పాట‌ను చేస్తే బావుంటుంద‌నిపించింది. దానిపై చాలా రీసెర్చ్ చేశాం. ఏపీలో గుసాడి, కొమ్ము కోయ‌, త‌ప్పెట గుళ్లు వంటి జాన‌ప‌ద నృత్యాల‌ను పాట‌లో భాగం చేయాల‌నుకున్నాను. అలాగే ప్రేక్ష‌కుల‌కు వీటితో పాటు ఇంకా బెస్ట్ ఇవ్వాల‌నిపించింది. అందులో భాగంగా వెస్ట్ బెంగాల్‌కు చెందిన చౌ, ఒరిస్సాకు చెందిను గుమ్రా, రాన‌ప్ప‌, పైకా, దురువ వంటి వాటితో పాటు క‌ర్ణాట‌కు చెందిన హ‌లారి. ఒక్క‌లిగ‌, గొర‌వ‌ర‌, కుణిత వంటి నృత్య రీతుల‌ను కూడా భాగం చేయాల‌నుకుని చాలా రీసెర్చ్ చేసి చేశాం. దీనివ‌ల్ల పాట చాలా గ్రాండియ‌ర్ లుక్‌తో రావ‌ట‌మే కాదు, సౌండింగ్ కూడా ఇది వ‌ర‌కు ఎన్న‌డూ విన‌నంత కొత్త‌గా వ‌చ్చింది. ఈ పాట ఒక సెల‌బ్రేష‌న్‌లా ఉంటుంది. రామ్ చ‌ర‌ణ్ అద్భుత‌మైన డాన్స‌ర్‌. గ‌ణేశ్ ఆచార్య‌గారు ఈ పాట‌కు కొరియోగ్ర‌ఫీ అందించారు. చ‌ర‌ణ్ అయితే ఓ బీజీఎంను సింగిల్ షాట్‌లో పూర్తి చేయ‌టం విశేషం. ఇది చ‌ర‌ణ్ ఫ్యాన్స్‌, సినీ ల‌వ‌ర్స్‌కు ఓ ట్రీట్‌లా ఉంటుంది. లిరిసిస్ట్ అనంత్ శ్రీరామ్ పాట‌ను సూప‌ర్బ్‌గా రాశారు. దిల్ రాజు, శిరీష్‌గారు చాలా స‌పోర్ట్‌గా నిలిచారు’’ అని వివరించారు.మ్యూజిక్ డైరెక్టర్ తమన్ మాట్లాడుతూ ‘‘గేమ్ చేంజ‌ర్‌లోని 'రా మ‌చ్చా మ‌చ్చా' సాంగ్‌లో అన్నీ సంస్కృతుల‌ను చూపించ‌టం కనులపండుగలా ఉంటుంది. శంక‌ర్‌గారు చాలా హుక్ లైన్స్ పరిశీలించి చివ‌ర‌కు 'రా మ‌చ్చా మ‌చ్చా' అనే లైన్‌ను సెల‌క్ట్ చేసుకున్నారు. పాట‌ను స్క్రీన్‌పై చూస్తున్న‌ప్పుడు ఎంజాయ్ చేస్తారు. సెప్టెంబర్ 30న పాట రిలీజ్ కానుంది’’ అని వెల్లడించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com