టాలీవుడ్ హీరోయిన్లు, ముఖ్యంగా నాగచైతన్య- సమంత విడాకులకు సంబంధించి మంత్రి కొండా సురేఖ చేసిన వ్యాఖ్యలు కలకలం రేపుతున్నాయి. దీనిపై పలువురు సినీ ప్రముఖులు స్పందిస్తున్నారు.ఇప్పటికే ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తాజాగా అక్కినేని నాగార్జన మంత్రి వ్యాఖ్యలపై స్పందించారు. సోషల్ మీడియా వేదికగా 'గౌరవనీయ మంత్రివర్యులు కొండా సురేఖ గారి వ్యాఖ్యలని తీవ్రంగా ఖండిస్తున్నాను. రాజకీయాలకు దూరంగా ఉండే సినీ ప్రముఖుల జీవితాలని, మీ ప్రత్యర్ధులని విమర్శించేందుకు వాడుకోకండి. దయచేసి సాటి మనుషుల వ్యక్తిగత విషయాలని గౌరవించండి. బాధ్యత గలిగిన పదవి లో ఉన్న మహిళగా మీరు చేసిన వ్యాఖ్యలు, మా కుటుంబం పట్ల మీరు చేసిన ఆరోపణలు పూర్తిగా అసంబద్ధం, అబద్ధం. తక్షణమే మీ వ్యాఖ్యలను వెనక్కి తీసుకోవలిసిందిగా కోరుతున్నాను' అని కోరారు నాగార్జున.
అంతకు ముందు ప్రముఖ నటుడు ప్రకాశ్ రాజ్ మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలను ఖండించారు. సోషల్ మీడియా వేదికగా స్పందించిన ఆయన ' ఏంటీ ఈ సిగ్గులేని రాజకీయాలు.. ల్లో నటించే ఆడవాళ్ళంటే ఇంత చిన్న చూపా?.. జస్ట్ ఆస్కింగ్' అంటూ కామెంట్స్ చేశారు. ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ.. సినీ నటుల గురించి చేసిన వ్యాఖ్యలకు సంబంధించిన వీడియోను షేర్ చేశారు.మొత్తానికి మంత్రి కొండా సురేఖ వ్యాఖ్యలు ఇప్పుడు టాలీవుడ్ లో ప్రకంపనలు రేపుతున్నాయి. కేటీఆర్ ను విమర్శించే క్రమంలో ఏ మాత్రం సంబంధం లేని ఇండస్డ్రీని లాగడంపై భిన్నాభి ప్రాయాలు వ్యక్తమవుతున్నాయి.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa