ట్రెండింగ్
Epaper    English    தமிழ்

నాకు మందు కొట్టే అలవాటుందన్న యాంకర్ శ్రీముఖి

cinema |  Suryaa Desk  | Published : Wed, Jun 12, 2019, 03:43 PM

శ్రీముఖి తన యాంకరింగ్‌తో   ఈ తరం యువతను ఎట్రాక్ట్ చేయడంలో ముందుంది.   'పటాస్' షో పాపులర్ అవ్వడానికి యాంకర్ రవితో పాటు శ్రీముఖి కూడా మెయిన్ రీజన్ అని చెప్పక తప్పదు. ప్రస్తుతం టాప్ యాంకర్స్ సుమ, అనసూయ, రష్మిలతో పోలిస్తే వారికి భిన్నంగా తన యాటిట్యూడ్ తో దూసుకుపోతున్న శ్రీముఖి ఇటీవలే పటాస్ షోకి బ్రేక్ ఇస్తున్నట్లు ప్రకటించింది. తాజాగా అభిమానులతో లైవ్ చాటింగ్ చేస్తూ వారితో తన వ్యక్తిగత విషయాలను పంచుకుంది. వారడిగిన పలు ప్రశ్నలకు తనదయిన శైలిలో సమాధానాలను చెప్పి సందడి చేసింది. ఈ విశేషాలు క్లుప్తంగా మీకోసం .. ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ‘నాకు బేసిగ్గా విలన్ రోల్స్ అంటే చాలా ఇష్టం అని చెప్పింది. ఎందుకంటే రియల్ లైఫ్‌లో నేను చాలా మంచి దాన్ని. కనీసం విలన్ రోల్స్ చేయడం వల్ల నాలోని విలనిజాన్ని మీకు చూపించాలనే కోరిక తీరుతుంది అంటూ సమాధానమిచ్చింది. విలన్ రోల్స్ వల్ల నటిగా నిరూపించుకునే అవకాశం ఎక్కువ. యాక్టింగ్ స్కిల్స్ ఇంప్రూవ్ అవుతాయని శ్రీముఖి చెప్పింది.


అనసూయ, రష్మి, ప్రదీప్, హైపర్ అది పైన ఒక అభిమాని అడిగిన ప్రశ్నకు సమాధానంగా ,రష్మి చాలా స్ట్రెయిట్ ఫార్వర్డ్, అనసూయ హార్డ్ వర్కింగ్ అండ్ ఫ్యామిలీ పర్సన్స్. ఇద్దరూ నాకు చాలా ఇష్టం. మా యాంకర్ అందరికీ దేవత... యాంకర్ మదర్ ఇండియా మా సుమక్క.ఇక ప్రదీప్ చాలా టాలెంటెడ్.. హైపర్ ఆది అమేజింగ్ రైటర్  అంటూ సమాధానంఇచ్చింది. దాంతో పాటు మీరు మందు కొడతారా? అనే ప్రశ్నకు శ్రీముఖి మొమమాటం లేకుండా సమాధానం ఇచ్చారు.  నిజాయితీగా చెప్పాలంటే... అపుడపుడు మందు కొడతాను. ఎక్కువగా వైన్ ప్రిఫర్ చేస్తాను. అది ఆరోగ్యం కూడా  అంటూ తన నిజాయితీని చాటుకుంది శ్రీముఖి. మరోవైపు సోషల్ మీడియాలో ఇంతమంది అభిమానులు దొరకడం తన అదృష్టమంటూ చెప్పింది.  మీ అభిమానం నన్ను మరింత బాగా చేయాలనేలా ముందుకు నడిపిస్తుందని అంటూ  శ్రీముఖి చెప్పుకొచ్చారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa