ట్రెండింగ్
Epaper    English    தமிழ்

గతంలో కొన్ని తప్పులు చేశాను : పత్రలేఖ

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 13, 2019, 11:38 AM

గతంలో కొన్ని తప్పులు చేశాను. సినిమాల ఎంపికలో నిక్కచ్చిగా వ్యవహరించలేదు అని వ్యాఖ్యానిస్తోంది యువ తార పత్రలేఖ. త్వరలో బద్నామ్‌ గాలి అనే చిత్రంతో బాలీవుడ్‌ ప్రేక్షకుల ముందుకు రాబోతోంది భామ. ఈ నాయికకు గతంలో సరైన విజయాలు లేవు. దాంతో అవకాశాలు లేక కష్టపడింది. ఆ సమయంలో తను చేస్తే మంచి సినిమాలే చేయాలి లేకుంటే కథా బలం లేని, పాత్రలో వైవిధ్యం లేని చిత్రాలు చేయకూడదు అని నిర్ణయించుకుందట. ఇలాంటి నిర్ణయం వల్ల చేసేది ఒక చిత్రమైనా పేరు తీసుకొస్తుందని పత్రలేఖ నమ్ముతోంది. మనకు నచ్చని పాత్రలు ఒప్పుకోవడం వల్లే ఇదంతా జరుగుతోందని చెబుతోంది. మనసుకు నచ్చని సినిమాలు చేస్తే అందులో సహజంగా నటించలేమన్నది ఈ నాయిక మాట. పత్రలేఖ మాట్లాడుతూ…మన నట ప్రయాణం ఇంకొకరి నిర్ణయంపై ఆధారపడి ఉండకూడదు అని భావిస్తుంటా. నాకు నచ్చిన పాత్రలే చేసినప్పుడు వాటి ఫలితం అంతే బాగుంటుందని ఆశిస్తుంటాను. గతంలో కొన్ని తప్పులు చేశాను. సినిమాల ఎంపికలో నిక్కచ్చిగా వ్యవహరించలేదు. దాంతో అవి పరాజయం పాలయ్యాయి. అవకాశాలు తగ్గాయి. మనం మనస్ఫూర్తిగా అంగీకరించని సినిమాలు ఒప్పుకోవద్దని ఆ కష్టకాలంలో నిర్ణయం తీసుకున్నాను. అంటూ చెప్పుకుంది.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa