తెలుగు సినిమాల్లో వైవిధ్యభరితమైన పాత్రల ద్వారా మంచిపేరు తెచ్చుకున్న నటుల్లో శేఖర్ ఒకరు. 'ఛత్రపతి' సినిమాలోని ఆయన పాత్ర చాలామందికి గుర్తుండిపోతుంది. అందువల్లనే 'ఛత్రపతి' శేఖర్ గానే ఆయనని పిలుస్తుంటారు. తాజా ఇంటర్వ్యూలో ఆయన మాట్లాడుతూ ఒక ఆసక్తికరమైన విషయాన్ని గురించి చెప్పుకొచ్చాడు.
'స్టూడెంట్ నెంబర్ 1' సినిమా షూటింగు జరుగుతుండగా ఒక సంఘటన జరిగింది. నేను చాలా షార్ప్ గా నా పాకెట్ లో నుంచి కత్తి బయటికి తీయాలి. రాంగ్ టైమింగ్ కారణంగా ఆ 'పిడి' దగ్గర అంచు ఎన్టీఆర్ చేతికి తగిలింది. అంతే .. షూటింగు స్పాట్ లో వున్న వాళ్లంతా నా వైపు అదోలా చూశారు. ఆ చూపులు నాకు చాలా ఇబ్బందిని కలిగించాయి. నేను కూడా 'అబ్బా తగిలేసిందే .. ఏమంటారో ఏమో' అని టెన్షన్ పడ్డాను. కానీ తారక్ మాత్రం పెద్దగా పట్టించుకోలేదు. 'ఏం ఫరవాలేదు శేఖర్ .. మళ్లీ చేద్దాం' అన్నారు. దాంతో నా మనసు కుదుటపడింది" అని చెప్పుకొచ్చాడు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa