సూపర్ స్టార్ మహేష్ బాబు హీరోగా నటించిన ‘భరత్ అను నేను’తో తెలుగులో ఎంట్రీ ఇచ్చిన కియారా అద్వానీ.. ఆ ఒక్క సినిమాతోనే స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఆ సినిమా సక్సెస్ తర్వాత.. రామ్ చరణ్ సరసన ‘వినయ విధేయ రామ’లోనూ తన అంద చందాలతో బాగానే ఆకర్షించింది. ఇండస్ట్రీతో సంబంధం లేకుండా ఎక్కడ ఆఫర్ వస్తే అక్కడ నటించేందుకు ఓకే చెబుతోన్న ఈ అమ్మడు ప్రస్తుతం సందీప్ రెడ్డి వంగా దర్శకత్వంలో తెలుగులో హిట్టైయిన అర్జున్ రెడ్డి హిందీ రీమేక్ ‘కబీర్ సింగ్’లో హీరోయిన్‌గా నటిస్తోంది. తాజాగా ఈ కథానాయికగా కెరీర్ మొదట్లో హీరోయిన్‌గా పడిన కష్టాల గురించి చెప్పుకొచ్చింది. హీరోయిన్‌గా ఆమె నటించిన ఫస్ట్ మూవీ ‘ఫగ్లీ’. 2014లో రిలీజైన ఈ సినిమా బాక్సాఫీస్ దగ్గర డిజాస్టర్ అయింది. ఈ సినిమా ఫ్లాప్ తర్వాత హీరోయిన్‌గా తనకు అవకాశాలు రాలేదని చెప్పుకొచ్చింది. కెరీర్‌లో గ్యాప్ రావడం వల్ల తనకు మంచే జరిగిందన్నారు.
ఈ సినిమా తర్వాత పలువురు దర్శకులని కలిసి సినిమాల్లో అవకాశం ఇవ్వమని నేను ఎంతో మంది దర్శకులని కలిసాను. ఐనా తమ సినిమాల్లో నన్నుమాత్రం తీసుకునే వారు కాదు. ఆ తర్వాత నీరజ్ పాండే దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎం.ఎస్.ధోని’ సినిమా తనకు హీరోయిన్‌గా బ్రేక్ ఇచ్చిందన్నారు. ఆ తర్వాత చేసిన ‘మెషిన్’ సరిగా నడవలేదు. కానీ ఈ సినిమాలో ‘చీజ్ బడీ’ పాట అందరి దృష్టిలో పడింది. ఆ తర్వాత తెలుగులో మహేష్ బాబుతో చేసిన ‘భరత్ అను నేను’ సినిమాతో నా కెరీర్ గాడిన పడింది. నిజానికి సౌత్ సినిమాలతోనే నేను హీరోయిన్‌గా నిలదొక్కుకున్ననని చెప్పుకొచ్చారు. ఇక బాలీవుడ్‌లో చేసిన ‘లస్ట్ స్టోరీస్’ అనే వెబ్ సిరీస్‌తో నాకు బాగా నటించే అవకాశం ఉందన్నారు. ప్రస్తుతం కియారా నటించిన ‘కబీర్ సింగ్’ ఈ నెల 21న విడుదల కానుంది. మరోవైపు ఈ భామ ‘లక్ష్మీ బాంబ్’,‘గుడ్ న్యూస్’, ‘షేర్ షా’ సినిమాల్లో నటించనున్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa