ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్ రోహిత్ బాల్ (63) కన్నుమూశారు. గుండె సంబంధిత సమస్యలతో బాధపడుతున్న ఆయన శుక్రవారం తుది శ్వాస విడిచారు. రోహిత్ బాల్ మరణ వార్తను ఫ్యాషన్ డిజైన్ కౌన్సిల్ (FDCI) ధ్రువీకరించింది. పురుషులు, మహిళలకు ఆయన అందించిన డిజైన్లు బాగా ప్రసిద్ధి చెందాయి. 1986లో ఆర్చిడ్ ఓవర్సీ ప్రైవేట్ లిమిటెడ్‌ని స్థాపించి తన వృత్తిని ప్రారంభించారు. ఫ్యాషన్ ఈవెంట్లో ‘డిజైనర్ ఆఫ్ ది ఇయర్’ అనే బిరుదును అందుకున్నారు.గతేడాది నవంబర్‌లో గురుగ్రామ్‌లోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో ఐసీయూలో చేరి చికిత్సపొందిన బాల్.. రెండు వారాల క్రితం ముంబయిలో జరిగిన లాక్మే ఇండియా ఫ్యాషన్ వీక్‌లో తన చివరి ప్రదర్శన ఇచ్చారు. 1961 మే లో శ్రీనగర్‌లో జన్మించిన రోహిత్ బల్.. 1986లో తన సోదరుడు రాజీవ్ బల్‌తో కలిసి తన కెరీర్‌ను ప్రారంభించి దేశంలోని ప్రముఖ ఫ్యాషన్ డిజైనర్‌గా గుర్తింపు పొందారు. ఫ్యాషన్ రంగంలో తనదైన ముద్ర వేసి అనేక అవార్డులు సొంతం చేసుకున్నారు.