ట్రెండింగ్
Epaper    English    தமிழ்

ఆయన సినిమాలను మొదటిరోజున మొదటి ఆట చూస్తుంటాను: నిరోషా

cinema |  Suryaa Desk  | Published : Thu, Jun 20, 2019, 05:10 PM

నిన్నటితరం హీరోయిన్ గా కుర్రకారు మనసులను దోచేసిన నిరోషా, పెళ్లి తరువాత సినిమాలను దూరం పెట్టింది. కొంతకాలం క్రితమే రీ ఎంట్రీ ఇచ్చినప్పటికీ, కాస్త స్పీడ్ పెంచాలనే ఉద్దేశంతో ఆమె వుంది.


తాజా ఇంటర్వ్యూలో ఆమె మాట్లాడుతూ .. "సీనియర్ హీరోల్లో నాకు నాగార్జున గారంటే ఇష్టం. ఇప్పటి హీరోల్లో ఎన్టీఆర్ అంటే ఎక్కువ ఇష్టం. కెరియర్ తొలినాళ్లలో ఎన్టీఆర్ చేసిన పాత్రలు .. ఆ తరువాత చేసిన పాత్రలు చూస్తే ఆయనలో పరిపక్వత స్పష్టంగా కనిపిస్తుంది. నటన .. డాన్స్ .. ఫైట్స్ .. ఇలా అన్ని అంశాలకి సంబంధించి ఆయన అద్భుతంగా చేస్తున్నాడు. అందువల్లనే ఆయన సినిమాలను మొదటిరోజున మొదటి ఆట చూస్తుంటాను. ఆయన సినిమాలో నటించే అవకాశం వస్తే అంతకి మించిన అదృష్టం లేదనే అనుకుంటాను" అని చెప్పుకొచ్చింది.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa