లండన్ బాబులు లండన్ బాబులు అంటూ ఐటమ్ పాటతో మెప్పించింది సోఫీ చౌదరి. “1-నెనొక్కడినే”లో స్పెషల్ నంబర్ లో తనదైన వయ్యారంతో మురిపించిన బాలీవుడ్ నటి సోపీ చౌదరి ఆ తర్వాత తెలుగు పరిశ్రమలో కనిపించలేదు. ప్రస్తుతం బాలీవుడ్ లో కూడా తన కెరీర్ అంతంత మాత్రమే. టీవీ షోలు యోగా సెషన్లు అంటూ సోఫీ సోషల్ మీడియాల్లో కొంత హడావుడి చేస్తుంది…అయితే సోషల్ మీడియాలో మాత్రం యాక్టివ్ గా ఉంటుంది. ఎప్పటికప్పుడు టెంప్టింగ్ ఫోటోషూట్లతో హీటెక్కిస్తుంది. తాజాగా సోఫీ పచ్చ రంగు డిజైనర్ చీర, రవికెలో మతులు చెడగొట్టింది. ప్రస్తుతం ఈ ఫోటో ఇన్ స్టాలో వైరల్ గా మారింది. సోఫీ అందచందాలు మతులు చెడగొడుతున్నాయంటూ యూత్ కామెంట్ చేస్తున్నారు. సోఫీ స్టన్నింగ్ దీవాళీ లుక్ కి ఫిదా అయిపోయామంటూ కొందరు ప్రశంసలు కురిపిస్తున్నారు.