శ్రీకాకుళం జిల్లా కిల్లిపాలెం గ్రామానికి చెందిన అలాబానా చిన్నారావు ఇటీవల జరిగిన రోడ్డు ప్రమాదంలో తన కుడి కాలును కోల్పోయారు. ఈ విషయం తెలుసుకున్న పెదపాడు జనసేన పార్టీ యూత్ లీడర్ బొట్ట శంకర్ ఆధ్వర్యంలో చిన్నారావు తల్లికి బుధవారం 20,000రూ ఆర్థిక సహాయాన్ని అందజేశారు. ఈ కార్యక్రమంలో జనసేన యూత్ సభ్యులు, గ్రామస్థులు పాల్గొన్నారు.