ట్రెండింగ్
Epaper    English    தமிழ்

మొండితోక పై ఎందుకంత కక్ష సాధింపు

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 01:08 PM

వైయ‌స్ఆర్‌సీపీ నేతలు, కార్యకర్తలు లక్ష్యంగా టీడీపీ కూటమి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగా కక్ష సాధింపు చర్యలను కొనసాగిస్తోంది అని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. వారు మాట్లాడుతూ.... గతంలో చోటుచేసుకున్న సంఘటనలను వక్రీకరిస్తూ తప్పుడు కేసులు నమోదు చేస్తూ ఎల్లో మీ­డియా ద్వారా ఇష్టారాజ్యంగా లీకులిస్తున్నారు. నందిగామ నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే డా­క్ట­ర్‌ మొండితోక జగన్మోహనరావు, ఆయన సోదరు­డు, ఎమ్మెల్సీ అరుణ్‌కుమార్‌ నిత్యం ప్ర­భు­త్వ అక్రమా­లను ఎండగడుతున్నారు. అరుణ్‌కుమా­ర్‌ శాసనమండలిలో చురుగ్గా వ్యవహరిస్తున్నారు.


దీని­ని జీ­ర్ణిం­చుకోలేని ప్రభుత్వ పెద్దలు వారిపై కుట్రపన్నా­రు. దీంతో..  2022 నవంబరు 4న చంద్రబాబు నందిగామలో పర్యటనలో రాళ్ల దా­డి జరిగిందంటూ అ­ప్పట్లో నానా హంగామా చేశా­రు. కానీ, అది వర్కవు­ట్‌ కాలేదు. రెడ్‌బుక్‌ రా­జ్యాంగంలో భాగంగా తా­జా­గా ఆ ఉదంతంలో ఆధారాల్లేకున్నా, పోలీసులు గ­తంలో నమోదుచేసిన సెక్షన్‌–324ను మార్చి కొత్తగా 120 (బి), 147, 307, 324, 353 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. నలు­గురు నిందితులు కన్నెగంటి సజ్జనరావు, బెజవాడ కార్తీక్, పరిమి కిశోర్, మార్త శ్రీనివాసులను అరెస్టుచేసి, ఆదివారం నందిగామ కో­ర్టులో ప్రవేశపెట్టారు. న్యాయాధికారి పోలీసుల తీ­రును తప్పుపడుతూ సెల్ఫ్‌ బెయిల్‌ ఇవ్వాలని ఆదేశించారు. ఈ కేసులో కక్షసాధించేందుకు మ­రిన్ని అరెస్టులు చేయటానికి ప్రభుత్వం సిద్ధం అవ్వడం వెనుక దాగిఉన్న కుట్రని బయటపెడతాం అని తెలిపారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com