వాల్నట్స్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇవి మంచి రుచితో పాటు, పోషకాలను కలిగి ఉంటాయి. ఇది మెదడు ఆకారంలో ఉంటాయి.వీటిలో ఆల్ఫా-లినోలెనిక్ యాసిడ్ , విటమిన్ E, ఫాస్ఫరస్ వంటి పోషకాలు ఉంటాయి. వీటిని రోజూ తినడం వలన మన శరీరానికి ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయో ఇక్కడ తెలుసుకుందాం..ప్రతీ రోజూ రెండు వాల్నట్స్ తీసుకోవడం వలన ఒమేగా-౩ ఫ్యాటీ యాసిడ్స్ గుండె సంబంధిత సమస్యలను తగ్గిస్తుందని ఆరోగ్యనిపుణలు చెబుతున్నారు. అంతేకాకుండా, ఇది చెడు కొలెస్ట్రల్ను తగ్గిస్తాయి. అలాగే, దీనిలో ఉండే యాంటీ ఆక్సిడెంట్లు మెదడు ఆరోగ్యాన్ని కాపాడతాయి.ఎముకలు ఆరోగ్యంగా ఉండటం కోసం వీటిని తింటూ ఉండాలి. అలాగే దీనిలో మన శరీరానికి అవసరమైన పోషకాలు పుష్కలంగా ఉన్నాయి. వీటిలో ఐరన్, మాంగనీస్ మెగ్నీషియం ఉంటాయి. వాల్నట్స్లో ఉండే ఫైబర్ జీర్ణక్రియను మెరుగుపరుస్తుంది. అలాగే, మలబద్ధకాన్ని నివారించడంలో ఇది సహాయపడుతుంది. వీటిని నానబెట్టి తినడం వలన పొట్టలో గ్యాస్ ఏర్పడే ప్రమాదాన్ని తగ్గించవచ్చు.