ట్రెండింగ్
Epaper    English    தமிழ்

రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని విడిచి అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన కొనసాగించాలి

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 01:07 PM

ఆంధ్రప్రదేశ్‌లో అంబేద్కర్‌ రాజ్యాంగానికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తూట్లు పొడిచారని కర్నూలు జిల్లా వైయ‌స్ఆర్‌సీపీ అధ్యక్షుడు ఎస్వీ మోహన్‌రెడ్డి మండిపడ్డారు.కేవలం చంద్రబాబు తన రెడ్‌బుక్‌ రాజ్యాంగాన్ని మాత్రమే రాష్ట్రంలో అమలు చేస్తూ నిరంకుశ పాలన కొనసాగిస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో వైయ‌స్‌ జగన్‌మోహన్‌రెడ్డి పాలనలో డాక్టర్‌ బీఆర్‌ అంబేద్కర్‌ ఆశయాలకు అనుగుణంగా పాలన సాగిందని, ఇంటి వద్దకే సంక్షేమ పాలనతో పాటు సంక్షేమ పథకాలు అందించిన సంగతిని ఎస్వీ మోహన్‌రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఈ రోజు సంక్షేమ పథకాలు లేవు, రాజ్యాంగానికి విరుద్ధంగా పాలనను చంద్రబాబు సాగిస్తున్నారంటూ విమర్శించారు.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com