ట్రెండింగ్
Epaper    English    தமிழ்

డ్రగ్స్ నియంత్రణపై హోంమంత్రి అనిత అధ్యక్షతన ఏపీ కేబినెట్ సబ్ కమిటీ సమావేశం

Andhra Pradesh Telugu |  Suryaa Desk  | Published : Wed, Nov 27, 2024, 02:50 PM

ఆంధ్రప్రదేశ్ లో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ క్రమంలో చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రాభివృద్ధి పై ప్రత్యేక ఫోకస్ పెట్టినట్టు తెలుస్తోంది.కూటమి సర్కార్ ఇప్పటికే ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఒక్కొక్కటిగా అమలు చేస్తోంది. ఈ నేపథ్యంలో తాజాగా మరో కీలక నిర్ణయం తీసుకుంది. యాంటీ నార్కోటిక్ టాస్క్ ఫోర్స్ పేరును ఈగల్ గా మార్చడం పై కేబినెట్ సబ్ కమిటీలో చర్చించినట్టు హోమంత్రి అనిత వెల్లడించారు.ఈ క్రమంలో గంజాయి, డ్రగ్స్ నియంత్రణ పై సచివాలయంలో సమావేశం నిర్వహించినట్టు తెలిపారు. ముఖ్యంగా టాస్క్ ఫోర్స్ విధి విధాానాలతో పాటు కీలక నిర్ణయాల దిశగా సబ్ కమిటీ సమాలోచనలు జరిపిందన్నారు. ఈ భేటీలో మంత్రులు నారా లోకేష్, సత్య కుమార్, సంధ్యారాణి, కొల్లు రవీంద్ర పాల్గొన్నారు.


 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com