ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ లక్ష్యమని స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా అమరావతి సర్కిల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ మన్మయ్ పండాబ్ పేర్కొన్నారు. ఎస్బీఐ ఒంగోలు రీజియన్ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం స్థానిక ఎన్టీఆర్ కళాపరిషత్ హాలులో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మారుతున్న కాలంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతో ఖాతాదారులకు సంతృప్తికరమైన సేవలు అందజేస్తున్నట్లు తెలిపారు. వాట్సప్ బ్యాంకింగ్ ద్వారా సులభంగా సేవలు పొందవచ్చని చెప్పారు. ఇటీవల ఓటీపీ పరిమాణాన్ని ఎనిమిది నుంచి ఆరు అంకెలకు తగ్గించామన్నారు.
ఖాతాదారుల నుంచి ఫీడ్ బ్యాక్ తీసుకొనేందుకు ప్రత్యేక వ్యవస్థను ఏర్పాటు చేశామని తెలిపారు. కేంద్ర ప్రభుత్వ పథకాలైన ముద్ర, స్టాండప్ ఇండియా, అటల్ పెన్షన్ యోజన, ప్రధానమంత్రి సురక్ష బీమాయో జన వంటి వాటిని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్తు న్నామని చెప్పారు. అనంతరం పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా పలు అంశలు వివరించారు. కార్యక్రమంలో ఒంగోలు రీజనల్ మేనేజర్ గున్నేశ్వ రరావు, ఆర్‌ఏసీపీసీ అసిస్టెంట్ జీఎం వెంకట్రావు, చీఫ్ మేనేజర్లు హారతి, ఎల్వీవీ.నాగేశ్వరరావు, వేదం రాజేష్‌బాబు, హెచ్ఆర్ మేనేజర్ నళినీకాం త్, ఆర్ఓబీ సూపర్ వైజింగ్ చానల్ మేనేజర్ జానకిరామయ్య, స్థానిక మేనేజర్లు పి.వీరయ్య, కె. రామారావు, భవానిశంకర్పాత్రో, వివేక్, వేమజాల శ్రీనివాసరావు, సీహెచ్.శ్రీనివాసరావు, లక్ష్మీనారాయ ణ, రామకృష్ణ, అవినాష్ పాల్గొన్నారు.