ములకలచెరువు మార్కెట్ యార్డులో అన్న క్యాంటీనను ఏర్పాటు చేయాలని తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ నేత దాసరిపల్లి జయ చంద్రారెడ్డి కలెక్టర్ చామకూరి శ్రీధర్‌ను కోరారు. స్థానిక సీఎల్ఆర్సీ కార్యాలయంలో అధికారులతో జరిగిన సమీక్షాలో పాల్గొన్న కలెక్టర్‌ను ఆయన కలిసి పలు సమస్యలను విన్నవించారు.
ప్రతి రోజు వందలాది మంది రైతులు, కూలీలతో టమోటా మార్కెట్ జరుగుతోందని, ఇలాంటి చోట అన్న క్యాంటీన ఏర్పాటు చేస్తే మంచిదని, అలాగే ములకలచెరువు బస్టాండు సర్కిల్ సమీపంలో జాతీయ రహదారి పక్కన 110 ఏళ్ళ క్రితం బ్రిటీషు దొరలు నిర్మించిన బంగ్లా శిథిలమైందని, పంచాయతీ రాజ్ విశ్రాంతి భవనంలా ఉండేదని ఇక్కడ కొత్తగా విశ్రాంతి భవనం నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని కోరారు. ఆయన వెంట నియోజకవర్గ ప్రచార సమన్వయకర్త సీడు మల్లికార్జుననాయుడు ఉన్నారు.