రాష్ట్ర పర్యాటక రంగానికి ఊతమిస్తూ కేంద్ర ప్రభుత్వ పథకమైన "సాస్కి-2024-25 " ద్వారా తొలి విడతగా రూ.113.751 కోట్లు (66 శాతం) విడుదల చేసినట్లు రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ తెలిపారు. ఈ మేరకు కేంద్ర ఆర్థిక శాఖ ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిపారు.
తొలి విడత నిధుల్లో 75 శాతం వినియోగించాక తదుపరి విడత నిధులు (34 శాతం) విడుదల చేస్తామని కేంద్ర ఆర్థిక శాఖ వెల్లడించిందన్నారు.సాస్కి పథకం ద్వారా విడుదలైన నిధులతో అఖండ గోదావరి, గండికోటను అభివృద్ధి చేస్తామని వెల్లడించారు. సాస్కి నిధులతో ఆయా ప్రాంతాల్లో మౌలిక వసతులు, సౌకర్యాల కల్పనతో పాటు పర్యాటకులను ఆకర్షించేలా ఏర్పాట్లు చేస్తామని తెలిపారు. కీలకమైన ప్రాజెక్టులను తగిన విధంగా అభివృద్ధి చేయడం ద్వారా రాష్ట్రంలోని పర్యాటకులనే కాకుండా, జాతీయ, అంతర్జాతీయ పర్యాటకులను ఆకర్షించవచ్చని అన్నారు.