టీడీపీ పార్టీలో కార్యకర్తలకు పూర్తి భరోసా లభిస్తుందని ఎమ్మెల్యే మాధవి, ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసరెడ్డి పేర్కొన్నారు. మంగళవారం కడప నగర 24వ డివిజన టీడీపీ ఇనచార్జ్ ఎం.వి అశోక్‌రెడ్డి ఆధ్వర్యంలో రాజారెడ్డి వీధిలో సభ్యత్వ నమోదు కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వారు హాజరై మాట్లాడారు. కార్యకర్తలే పార్టీకి పునాదులుగా భావించి ఆది నుంచి తెలుగుదేశం పార్టీ ముందుకుసాగుతోందన్నారు. ఇందులో భాగంగా సభ్యత్వం తీసుకున్న కార్యకర్తలు ప్రమాదవశాత్తు మరణిస్తే వారి కుటుంబానికి పార్టీ అండగా నిలుస్తుందన్నారు. రూ.5 లక్షల ప్రమాద బీమా అందజేస్తుందన్నారు.
సాధారణ మరణం సంభవించినా మట్టి ఖర్చుల కింద వారి కుటుంబానికి రూ.10వేలు అందిస్తుందన్నారు. కావున కార్యకర్తలు, అభిమానులు తప్పక పార్టీ సభ్యత్వం తీసుకోవాలని కోరారు. అనంతరం అశోక్‌రెడ్డి తెలుగుదేశం పార్టీకి 1 లక్ష రూపాయలతో పార్టీ శాశ్వత సభ్యత్వం తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర పరిశీలకురాలు కుసుమకుమారి, 42వ డివిజన టీడీపీ సీనియర్ నాయకుడు బొమ్మిశెట్టి చంద్రశేఖర్, డివిజన నాయకుడు ఫరూక్, క్రిష్ణ, గురు, తేజారెడ్డి, జయంత, శ్రీనాథ్, సందీప్, విశ్వనాథ్, గణేష్ తదితరులు సభ్వత్వం స్వీకరించారు.