ఏపీకి మోదీ తీవ్ర అన్యాయం చేశారు. ప్రత్యేక హోదా ఇస్తామన్నమోదీ పదేళ్ల నుంచి రాష్ట్రానికి వెన్నుపోటు పొడుస్తూనే ఉన్నారు. విభజన హామీల్లో ఒక్క హామీ కూడా నిలబెట్టుకోలేదు. మోదీ అనుసరిస్తున్న రాజ్యాంగం కాబట్టి దేశంలో ఈ దారుణాలు జరుగుతున్నాయి. ఒక మతాన్ని అవమానించాలి.. మరో మతాన్ని రెచ్చగొట్టాలి.. ఈ మంటలో బీజేపీ నేతలు చలి కాచుకోవాలి. ఇదే ఆర్ఎస్ఎస్. , బీజేపీ అమలు చేసే రాజ్యాంగం. కులగణన జరగాలని చాలాసార్లు కాంగ్రెస్ డిమాండ్ చేసినా ఆ దిశగా బీజేపీ అడుగులు వేయడం లేదు. ఇప్పుడైనా కులగణన చేపట్టి.. వర్గాల వారీగా న్యాయం చేయాలి. రాహుల్ గాంధీ చెప్పినట్లుగా భారత రాజ్యాంగం పరిరక్షణ కోసం ప్రాణాలు ఇచ్చేందుకు మేమంతా సిద్ధం.రాహుల్ గాంధీతో కలిసి పోరాడతాం.. భారత రాజ్యాంగాన్ని కాపాడుకుంటాం’’ అని వైఎస్ షర్మిల స్పష్టం చేశారు.