డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఢిల్లీ పర్యటన 3 వ రోజు కొనసాగుతోంది. బుధవారం ఉదయం గం. 9.30 గంటలకు కేంద్ర మంత్రి భూపేందర్ యాదవ్‌తో భేటీ అవుతారు. 10,30 గంటలకు పార్లమెంట్భవనంలో ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో సమావేశమవుతారు. అలాగే ఈరోజు సాయంత్రం రెండు తెలుగు రాష్ట్రాల ఎన్డీఏ ఎంపీలకు పవన్ విందు ఇవ్వనున్నారు. వారికి తాజ్ హోటల్లో విందు ఏర్పాటు చేశారు. ఏపీలో బీజేపీ, తెలుగుదేశం, జనసేన ఎంపీలతో పాటు తెలంగాణ బీజేపీ ఎంపీలకు పవన్ కల్యాణ్ విందుకు ఆహ్వానించారు.