కుల,మతాలకు అతీతంగా ప్రజలకు సేవ చేస్తున్నానని మంత్రి టీజీ భరత అన్నారు. మంగళవారం కర్నూలు నగరంలోని మహ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ టేకర్ కమిటీ ఆధ్వర్యంలో రెండు బాడీ ఫ్రీజర్ బాక్స్‌లను మసీదులకు అందజేశారు. నగరం లోని న్యూసిటీ, ఓల్డ్ సిటీలోని రెండు మసీదులకు ఫ్రీజర్ బాక్స్ లను ఉచితంగా అందజేశారు.
ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహమ్మదీయ వక్ఫ్ కాంప్లెక్స్ కేర్ కమిటీ చేస్తున్న కార్యక్రమాలు అభినందనీయమన్నారు. కాంప్లెక్స్ నాలుగున్నర సెంట్లు స్థలం ఖాళీగా ఉందని, అందులో కంప్యూటర్ ల్యాబ్ ఏర్పాటు చేయనున్నట్లు తన దృష్టికి తీసుకువచ్చారని, ఇందుకు తాను సమ్మతించానని వెల్లడించారు. 8 మంది పేద ముస్లిం యువతుల వివాహాలకు ఒక్కొక్కరికి రూ.3వేలు కమిటీ తరపున చెక్కులు అందజేశారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమా ధికారి సబీనా పర్వీన, కమిటీ సభ్యులు మహమ్మద్ ఇబ్రహిం, గౌస్ రబ్బాని, టీడీపీ నాయకులు జహంగీర్, అబ్బాస్, హమీద్, రమీజ్ బాషా, షేక్ మహబూబ్, షేక్ అబ్దుల్ మునాఫ్ పాల్గొన్నారు.