డిస్నీ వాళ్ళు నిర్మించిన ‘లయన్ కింగ్’ సినిమా ఇష్టపడని వారు ఉండరు. డిస్నీ కామిక్ పుస్తకాలలో ఉండే ఈ కథలో క్రూర మృగాలు అన్నీ మిగతా మృగలతో కలిసి స్నేహంగా మెలుగుతాయి. వాటన్నిటికీ రారాజు సింహం (సింబా). సింబా తో పాటు ఒక ముంగిస టిమోన్ అనే ముంగీస, మరియు పుంబా అనే అడవి పంది ఎప్పుడూ పక్కనే ఉంటూ ఉంటాయి.
కామిక్ సీరియల్ గా మొదలైన ఈ కథ ను డిస్నీ సంస్థ 2డి యానిమేటెడ్ సినిమాగా ఎప్పుడో 90 లోనే విడుదల చేశారు. అప్పుడు సూపర్ హిట్ గా మారిన ఈ సినిమాని ఇప్పుడు 3డిలో మళ్లీ ప్రేక్షకుల ముందుకు తీసుకొస్తున్నారు.
ఈ సినిమాలో టాలీవుడ్ స్టార్ కమెడియన్లు కూడా భాగం కాబోతున్నట్లు సమాచారం అందుతోంది. లయన్ కింగ్ సినిమా 3డి వెర్షన్ జూలై 19న విడుదల కాబోతోంది. ఈ సినిమాలో పుంబా పాత్రకు హాస్యబ్రహ్మ బ్రహ్మానందం మరియు టిమోన్ పాత్రకు అలీ డబ్బింగ్ చెప్పబోతున్నారట.
ఈమధ్యనే ‘అవెంజర్స్’ సినిమాలో తానోస్ పాత్రకు రానా డబ్బింగ్ చెప్పాడు. ఇప్పుడు డబ్బింగ్ చెప్పడానికి స్టార్ కమెడియన్లు కూడా ముందుకు వచ్చేసారు. తెలుగు లో కూడా ‘లయన్ కింగ్’ భారీ అంచనాల మధ్య విడుదలకి రెడీ అవుతుంది.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa