ట్రెండింగ్
Epaper    English    தமிழ்

పోలీసులను ఆశ్రయించిన తమిళ నటి!

cinema |  Suryaa Desk  | Published : Fri, Jun 21, 2019, 07:54 PM

తన బాయ్ ఫ్రెండ్ మంజునాథ్ తనని ఫోటోలతో మరియు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని తమిళ నటి నీలాని పోలీసులను ఆశ్రయించింది .. అతడి వల్ల ప్రాణహాని ఉందని అతని పై చర్యలు తీసుకోవాలని ఆమె దర్యాప్తులో పేర్కొంది .. కొన్ని రోజులుగా నీలాని మంజునాథ్ మధ్య ప్రేమాయణం నడిచింది .. మధ్యలో ఇద్దరి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు విడిపోయారు .. అ తర్వాత మంజునాథ్ తనని ఫోటోలతో మరియు వీడియోలతో బ్లాక్ మెయిల్ చేస్తున్నాడని ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది .. "9 నెలల క్రితం విదేశాల్లో పని చేస్తున్న మంజునాథ్ తనకి పరిచయం అయ్యాడని, తనతో పాటు తన ఇద్దరు పిల్లలను బాగా చూసుకుంటానని చెప్పి దగ్గరయ్యాడని తెలిపింది. అయితే కొన్ని రోజుల తర్వాత మంజునాథ్ అసలు స్వరూపం తెలిసిందని, అతడికి అప్పటికే పెళ్లయి పిల్లలు కూడా ఉన్నారని తెలిసి దూరంగా ఉంటున్నట్లు నీలాని తెలిపారు.. 


 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa