ట్రెండింగ్
Epaper    English    தமிழ்

అమలాపాల్ కి సెన్సార్ షాక్

cinema |  Suryaa Desk  | Published : Sat, Jun 22, 2019, 07:55 AM

ఈ మ‌ధ్య  అమలాపాల్ కోలీవుడ్లో నటించిన ‘ఆడై’చిత్రాన్ని  తెలుగు లో ‘ఆమె’ పేరుతో అనువ‌దిస్తున్న విష‌యం విదిత‌మే. ఈ  సినిమా   టీజర్ను సైతం ఇటీవ‌లే రిలీజ్ చేసారు.  విడుద‌లైన కొద్ది గంట‌ల‌లోనే సామాజిక మీడియాలో   వైరల్ గా మారింది  ఈ టీజర్. అందుకు ప్ర‌ధాన‌ కారణం  ఇందులో అమలాపాల్  నగ్నంగా ద‌ర్శ‌న‌మివ్వ‌డ‌మే.  ఒక సెలబ్రెటీ అయి ఉండి ఇలాంటి నగ్న ప్రదర్శ ఏంటంటూ .   ఈ టీజర్ పై నెటిజ‌న్లు ట్రోలింగ్ ఆరంభించారు.  


అయితే   ఆమె సహజ  నటనకు హేట్సాఫ్ అన్న‌వారూ లేక‌పోలేదు. పాత్ర లో ఆమె జీవించిన‌ట్టే క‌నిపిస్తోంద‌న్న ప్ర‌శంస‌లూ అందుకుంటోంది.  దింతో సినిమాపై   అంచనాలు భారీగా పెరిగిపోతున్నాయి.


అయితే  ఈ మూవీలో ఇటువంటి షాట్స్ చాలానే ఉం డ‌టంతో సెన్సార్ తీవ్ర భ్యంత‌రాలు వ్య‌క్తం చేసింద‌ట‌.  చిత్రంలో క‌నిపిస్తున్న న‌గ్న సీన్ల‌ను  తొలగించడమో, డీఫోకస్ చేయడమో, వేరే వాటితో రీప్లేస్ చేయడమో చేయాలని చెప్పారట. దాంతో ఈసినిమాకి ‘ఏ’ సర్టిఫికెట్ జారీ చేశారట. ఈ చిత్రంపై అనేక ఆశ‌లు పెట్టుకున్న అమ‌లా పాల్‌కు ఇది పెద్ద షాకే. మరి నెటిజన్లు ఈ సీన్లు చూసి ఫిదా అయినవారు వాటిని తొలగిస్తే ఎంతవరకు మూవీని ఆదరిస్తారో చూడాలి.






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa