సాధారణంగా సినీ ఇండస్ట్రీలో సెలబ్రిటీలకు కార్ కలెక్షన్ అంటే చాలా ఇష్టం. ముఖ్యంగా చిరంజీవిని మొదలుకొని ఎన్టీఆర్, షారుఖ్ ఖాన్ వరకు ఇలా చాలామంది హీరోలు తమకు నచ్చిన కారును సొంతం చేసుకోవడానికి కోట్ల రూపాయలను కూడా ఖర్చు పెడుతూ ఉంటారు.ఇక ఇప్పుడు బాలీవుడ్ హీరోలు కూడా ఇదే బాట పట్టారు. ఒకరి తర్వాత ఒకరు లగ్జరీ కార్లను కొనుగోలు చేస్తూ అందరిని ఆశ్చర్యపరుస్తున్నారు. ఇదిలా ఉండగా మొన్నటికి మొన్న కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ లగ్జరీ కారు కొనుగోలు చేయగా.. ఇప్పుడు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ కూడా ఒక ఖరీదైన కారు కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యపరిచారు. మరి దీని ధర, ఫీచర్స్ తెలిస్తే మాత్రం నిజంగా ఆశ్చర్య పోవాల్సిందే
బాలీవుడ్ చిత్ర పరిశ్రమలో స్టార్ హీరోగా గుర్తింపు తెచ్చుకున్నారు అక్షయ్ కుమార్. ఈ ఏడాది అత్యధికంగా సినిమాలు చేసిన హీరోగా బాలీవుడ్లో టాప్ ప్లేస్ లో నిలిచారు. అంతేకాకుండా గతంలో కూడా ఆయన నటించిన సినిమాలన్నీ కూడా మంచి విజయం అందుకున్నాయి. బాలీవుడ్ లో అత్యధికంగా వరుసగా రూ.200 కోట్లకు పైగా వసూలు సాధించిన సినిమాల్లో హీరోగా నటించారు. ఇదిలా ఉండగా మరొకవైపు అక్షయ్ కుమార్ నుంచి వచ్చిన ఏడు సినిమాలు బాక్సాఫీస్ వద్ద డిజాస్టర్ గా నిలిచాయి. మినిమం గ్యారెంటీ హీరోగా పేరు తెచ్చుకున్న ఈయన కు దాదాపు నాలుగు సినిమాలు ఇటీవల నిరాశ మిగిల్చాయి. వీటి ఓపెనింగ్స్ కూడా రూ .3కోట్లలోపే ఉండవచ్చని సంబంధిత వర్గాల నుంచి వార్తలు వినిపించాయి.
ఇంతటి పేరున్న నటుడికి లగ్జరీ కార్లు అంటే ఎంతో ఇష్టం. అందుకే తాజాగా ఒక లగ్జరీ ఫీచర్లతో భూతల స్వర్గంలా ఉండే ఒక కార్ ను కొనుగోలు చేశారు అక్షయ్ కుమార్. జపాన్ కార్ల తయారీ కంపెనీ ‘టయోట’ నుంచి విడుదలైనటువంటి ఈ లగ్జరీ ఎంపీవీ వెల్ఫేర్ (luxury MPV vellfire). రోడ్డుపై వెళ్తుంటే ఇది ఒక ఇంద్ర భవనం కదిలి వెళుతున్నట్టు ఉంటుంది. ఇందులో ఉండే ఫీచర్లు కూడా అడ్వాన్స్ టెక్నాలజీని కలిగి ఉన్నాయి. ఈ ఫీచర్ కార్ సెలబ్రిటీలలో ఎక్కువ డిమాండ్ కలిగిన మోడల్ గా గుర్తింపు తెచ్చుకుంది. ముఖ్యంగా ఇందులో హాయ్, విఐపి అనే రెండు వేరియంట్ లలో లభిస్తుంది. దీని ధర రూ.1.32 కోట్లు (Ex- Showroom) . ముంబైలో దీని ఆన్ రోడ్డు ధర ఇన్సూరెన్స్ తో కలిపి సుమారుగా 1.60 కోట్లు.మొదటి చూపులోనే అందరిని కట్టిపడేసేలా ఉన్న ఈ ఎంపీవీలో అధునాతన ఫీచర్లు ఉన్నాయి. ఇంటీరియర్ డిజైన్ చాలా అద్భుతంగా ఉంది. పై కప్పుతో పాటు లోపల ఉన్న కలర్స్ కూడా ప్రయాణికులను విపరీతంగా ఆకట్టుకుంటాయి. వెనుక సీట్లు చాలా మెత్తగా, కంఫర్ట్ గా కూడా ఉంటాయి. రెండవ వరుస సీట్ల మధ్య గ్యాప్ కూడా ఎక్కువగా ఉంటుంది. ఇది ఒక హైబ్రిడ్ ఎంపీవి కారు అని చెప్పవచ్చు. 2.5 లీటర్ పెట్రోల్ / ఎలక్ట్రిక్ ఇంజన్ ఆప్షన్ తో పనిచేస్తుంది. ఇంజిన్ 142Kw పవర్ ను, గరిష్టంగా 240Nm టార్క్ ను విడుదల చేస్తుంది. ఈ కార్ 19.28 kmpl మైలేజ్ కూడా ఇస్తుంది . యాక్సిడెంట్ సమయంలో కారులో ఉన్న వారికి ఎలాంటి ప్రమాదం కూడా జరగదు.