అందరికీ నమస్కారం. ఇంతటి ప్రేమను అందించిన పాట్నా ప్రజలందరికీ నా ధన్యవాదాలు. నేను పుష్ప శ్రీవల్లి ఈ చిత్ర ట్రైలర్ లాంచ్ కార్యక్రమానికి మీ అందరిని ఎంతో ప్రేమగా ఆహ్వానిస్తున్నాను. ఈ చిత్రం కోసం రెండు సంవత్సరాల మీ ఎదురుచూపులు కచ్చితంగా మీరు ఊహించిన దానికి మించి ఉంటుంది అని నేను చెప్పగలను. ఇంతమంది అభిమానులు పుష్ప ప్రపంచంలోకి రావడం నాకు ఎంతో ఆనందాన్ని ఇస్తుంది. ఈ చిత్రం ట్రైలర్ మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నాను. డిసెంబర్ 5వ తేదీన ప్రేక్షకుల ముందుకు రాబోతున్న ఈ చిత్రాన్ని మీరు మీ కుటుంబ సభ్యులతో, మిత్రులతో కలిసి చూడాలని నేను కోరుకుంటున్నాను.