రామ్, పూరి జగన్నాథ్ కాంబినేషన్‌లో వస్తున్న ‘ఇస్మార్ట్ శంకర్’ ఈ సినిమా విడుదలను వాయిదా వేశారు. జూలై 14న వరల్డ్ కప్ ఫైనల్స్ జరగనున్న కారణంగా ఆ ప్రభావం సినిమా మీద పడుతుందని , చిత్ర యూనిట్‌తో చర్చలు జరిపిన దర్శక నిర్మాతలు సినిమా జూలై 12న బదులు జూలై 18న విడుదల చేయాలని నిర్ణయించారు. పూరి జగన్నాథ్ టూరింగ్ టాకీస్, పూరి కనెక్ట్స్ పతాకాలపై పూరి జగన్నాథ్, ఛార్మి ఈ చిత్రాన్ని నిర్మిస్తుండగా హీరో రామ్ సరసన నిధి అగర్వాల్, నభా నటేశ్ లు హీరోయిన్స్‌గా చేస్తున్నారు. వరుస ఫ్ఆపులతో సతమతమవుతున్న రామ్, పూరీలు ఇటీవల విడుదలైన టీజర్‌కు మంచి రెస్పాన్స్ రావటంతో పాటు ఆడియో కుర్రకారుకి నచ్చటంతో తెగ ఉత్సాహంగా ఉన్నారు.
|
|
SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. Suryaa.com and Epaper Suryaa