ఇప్పుడిప్పుడే తెలుగు సినీ పరిశ్రమలో ఆఫర్స్ అందుకుంటుంది హీరోయిన్ భాగ్య శ్రీ బొర్సే. ఇప్పుడు ఈ అమ్మడు యంగ్ హీరోలకు లక్కీ ఛాన్స్ గా మారింది. ప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్టులో నటిస్తున్న ఈ ముద్దుగుమ్మ..తాజాగా మరో క్రేజీ ఛాన్స్ కొట్టేసిందట.మాస్ మాహారాజా రవితేజ సరసన మిస్టర్ బచ్చన్ తో తెలుగు తెరకు పరిచయమయ్యింది భాగ్య శ్రీ బొర్సే. డైరెక్టర్ హరీశ్ శంకర్ దర్శకత్వం వహించిన ఈ మూవీ అంతగా ఆకట్టుకోలేకపోయింది.ఈ విడుదలకు ముందే స్పెషల్ అట్రాక్షన్ అయ్యింది ఈ ముద్దుగుమ్మ. అందం, అభినయంతో తెలుగు ప్రేక్షకులకు కట్టిపడేసింది. కానీ ఫస్ట్ మూవీ డిజాస్టర్ కావడంతో ఈ బ్యూటీకి అంతగా క్రేజ్ రాలేదుప్రస్తుతం తెలుగులో ఓ ప్రాజెక్ట్ చేస్తుంది. తాజాగా ఈ అమ్మడు మరో క్రేజీ ఆఫర్ అందుకున్నట్లుగా సమాచారం. మిస్ శెట్టి మిస్టర్ పొలిశెట్టి దర్శకుడు మహేశ్ దర్శకత్వంలో రామ్ పోతినేని ఓ చేస్తున్నాడు.
RAPO 22 పేరుతో ఈ ను తెరకెక్కిస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇందులో హీరోయిన్ భాగ్య శ్రీ బోర్సేను ఎంపిక చేసినట్లుగా అధికారికంగా ప్రకటించారు. ఈ కు సంబంధించిన వివరాలు ప్రకటించనున్నారు.త్వరలోనే ఈ ప్రాజెక్ట్ వివరాలు వెల్లడించనున్నారు. ఇదిలా ఉంటే.. ఈ అమ్మడు సోషల్ మీడియాలో అంతగా యాక్టివ్ గా కనిపించదు. ఎప్పుడో ఒకసారి క్రేజీ ఫోటోస్ షేర్ చేస్తుంటుంది.