తన అద్భుతమైన గాత్రంతో శ్రోతలను అలరించే ప్రముఖ సింగర్ సునీత తన అందంతో కూడా ప్రేక్షకులను ఆకట్టుకుంటూ ఉంటుంది. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉండే.. సింగర్ నిత్యం తన ఫోటోలను, పర్సనల్ విషయాలను షేర్ చేస్తుంటారు. ఇదిలా ఉంటే.. ఆమె రెండో పెళ్లి చేసుకున్నప్పటినుంచి నెట్టింట పలు రూమర్స్ క్రియేట్ అవుతున్నాయి. తాజాగా ఆమె 45 ఏళ్ల వయసులో మరోసారి తల్లి కాబోతుంది అంటూ రూమర్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి.కేవలం తెలుగులోనే కాకుండా తమిళం, మలయాళం భాషలలో కూడా ఎన్నో పాటలు పాడిన సునీతకి దక్షిణ భారతదేశంలోనే అంతులేని ఫ్యాన్ బేస్ ఉంది. సుమారు 3000 పాటలకు పైగా పాడిన సునీత 500 సినిమాలకు పైగా డబ్బింగ్ చెప్పింది. వీటితోపాటు తెలుగు సింగింగ్ రియాలిటీ షోస్ లలో జడ్జ్ గా బుల్లితెరపై కనిపించి అభిమానులకు మరింత దగ్గర అయింది.