శివ దర్శకత్వంలో కోలీవుడ్ స్టార్ నటుడు సూర్య నటించిన 'కంగువ' సినిమా నవంబర్ 14న విడుదల అయ్యింది. ఈ యాక్షన్ డ్రామా గత జన్మల కాన్సెప్ట్‌తో రూపొందింది. ఈ సినిమా అన్ని భాషలలో 3D ఫార్మటులో విడుదల అయ్యి మిక్స్డ్ రివ్యూస్ ని సొంతం చేసుకుంటుంది. తాజాగా మూవీ మేకర్స్ ఈ సినిమా నుండి స్నిక్ పీక్ 2 ని విడుదల చేసినట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో దిశా పాటని కథానాయికగా నటిస్తుంది. బాబీ డియోల్, యోగి బాబు ఈ చిత్రంలో కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రానికి రాక్ స్టార్ దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. అత్యంత భారీ బడ్జెట్‌తో రూపొందిన ఈ చిత్రంలో సూర్య ద్విపాత్రాభినయంలో కనిపించనున్నారు. ఈ భారీ బడ్జెట్ ఎంటర్‌టైనర్‌ని స్టూడియో గ్రీన్ మరియు యువి క్రియేషన్స్ సంయుక్తంగా నిర్మిస్తున్నాయి.