కిరణ్ అబ్బవరం హీరోగా నటించిన 'క' KA సినిమా మంచి కమర్షియల్ సక్సెస్ ను అందుకుంది. ఈ దీపావళికి లక్కీ బాస్కర్, అమరన్‌లతో కలిసి విడుదలైంది. బలమైన పోటీ ఉన్నప్పటికీ, KA బాగా ఆడింది.బాక్సాఫీస్ వద్ద విజయం సాధించింది. థియేట్రికల్‌గా అనుకున్న లక్ష్యాన్ని చేరుకున్న తర్వాత ఈ సినిమా OTT ప్రీమియర్‌కు సిద్ధమవుతోంది. సినిమా డిజిటల్ హక్కులను ETV విన్ కొనుగోలు చేసింది. వచ్చే వారాంతంలో OTT ప్లాట్‌ఫారమ్‌లో ప్రసారం అయ్యే అవకాశం ఉందని భావిస్తున్నారు. మేకర్స్ సీక్వెల్ కోసం ప్లాన్ చేస్తున్నందున ప్రేక్షకుల OTT రిసెప్షన్ కూడా చాలా ముఖ్యం.సుజిత్, సందీప్ కెఎ దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని చింతా గోపాలకృష్ణ రెడ్డి నిర్మించారు. ప్రముఖ తమిళ సంగీత దర్శకుడు, సామ్ C.S చిత్రానికి సంగీతం అందించారు. మ్యూజిక్ కు మంచి పేరు వచ్చింది. క లో తన్వి రామ్, నయన్ సారిక, అచ్యుత్ కుమార్ కూడా కీలక పాత్రల్లో నటించారు. చిత్రం స్క్రీన్ ప్లే, సాంకేతిక విలువలు, BGM ప్రశంసలు అందుకున్నాయి.