అక్కినేని నాగేశ్వరరావు బయోపిక్ గురించి ఇప్పటికే ఎన్నోసార్లు చర్చ కొనసాగింది. ఆయన బయోపిక్ తెరకెక్కబోతోందంటూ ఎన్నోసార్లు వార్తలు వచ్చాయి. అయితే ఇప్పటి వరకు ఆ ప్రాజెక్ట్ పట్టాలెక్కలేదు. తాజాగా ఈ బయోపిక్ పై నాగార్జున స్పందించారు. ఏఎన్నార్ బయోపిక్ పై ఎప్పుడూ చర్చ జరుగుతూనే ఉంటుందని నాగార్జున అన్నారు. అయితే దాన్ని సినిమాగా కంటే డాక్యుమెంటరీగా తీస్తే బాగుంటుందనేది తన అభిప్రాయమని చెప్పారు. ఎందుకంటే ఆయన జీవితాన్ని సినిమాగా తీయాలంటే చాలా కష్టమని తెలిపారు. తన జీవితంలో ఏఎన్నార్ ఎప్పుడూ వెనకడుగు వేయలేదని నాగార్జున అన్నారు. ఆయన ఎదుగుదల అలా కొనసాగుతూనే పోయిందని చెప్పారు. ఆయన ఎదుగుదలను తెరపై చూపిస్తే బోర్ కొడుతుందేమోనని అన్నారు. ఒడిదుడుకులను చూపిస్తేనే సినిమా బాగుంటుందని చెప్పారు. అందుకే ఆయన జీవితంలో కొన్ని కల్పితాలను జోడించి డాక్యుమెంటరీ రూపొందించాలని అన్నారు.