టాలీవుడ్‌లో బొమ్మరిల్లు, నువ్వొస్తానంటే నేనొద్దంటానా వంటి బ్లాక్‌బస్టర్ చిత్రాల్లో నటించిన లవర్ భాయ్ సిద్ధార్థ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఆయన తెలుగులో చేసింది కొన్ని సినిమాలే చేసినా, ప్రేక్షకుల్లో మంచి ఫాలోయింగ్ సంపాదించుకున్నాడు. తన యాక్టింగ్‌తో పాటు సింగింగ్ టాలెంట్ తోనూ మంచి గుర్తింపును తెచ్చుకున్నాడు. ఇక ఇటీవల వరుసగా సెలెక్టివ్‌గా సినిమాలు చేస్తూ బాక్సాఫీసు వద్ద సందడి చేస్తున్నాడుయంగ్ హీరో సిద్ధార్థ్, ఆషికా రంగనాథ్ హీరోహీరోయిన్లుగా నటించిన చిత్రం ‘మిస్ యూ’. ఎన్.రాజశేఖర్ ఈ చిత్రానికి దర్శకత్వం వహించారు. ఈ చిత్రం తెలుగు, తమిళ భాషల్లో నవంబర్ 29న విడుదలకు సిద్ధమైంది. ఈ నేపథ్యంలో తాజాగా ఈ చిత్ర థియేట్రికల్ ట్రైలర్‌ను మేకర్స్ విడుదల చేశారు. ప్రస్తుతం ఈ ట్రైలర్ టాప్‌లో ట్రెండ్ అవుతోంది.