కొన్ని వీడియో క్లిప్పింగ్స్ కు సంబంధించిన వివాదంలో హీరో ధనుష్, హీరోయిన్ నయనతార మధ్య న్యాయపరమైన పోరాటం జరుగుతున్న సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో, నయనతార సోషల్ మీడియాలో కర్మ సిద్ధాంతాన్ని ప్రస్తావిస్తూ చేసిన పోస్టు అత్యంత ఆసక్తి కలిగిస్తోంది. "కర్మ ఏం చెబుతుందంటే... అబద్ధాలతో నువ్వు ఇతరుల జీవితాలను నాశనం చేస్తే అదొక అప్పు అవుతుంది.... ఆ అప్పు వడ్డీతో సహా తిరిగి నీ దగ్గరకే వస్తుంది!" అంటూ నయనతార తన పోస్టులో పేర్కొంది. 'నానుమ్ రౌడీ దాన్' అనే సినిమా క్లిప్పింగ్స్ ను నయనతార తన డాక్యుమెంటరీలో ఉపయోగించుకోవడం పట్ల ధనుష్ న్యాయపరమైన చర్యలు తీసుకుంటున్నారు. ఇటీవలే నయనతార, ఆమె భర్త విఘ్నేశ్ శివన్ పై ధనుష్ కోర్టులో దావా వేశారు. ఈ నేపథ్యంలో నయనతార సోషల్ మీడియా పోస్టు ప్రాధాన్యత సంతరించుకుంది.