దేవర' సినిమాతో ఘన విజయాన్ని అందుకున్న జూనియర్ ఎన్టీఆర్... ప్రస్తుతం హిందీ చిత్రం 'వార్ 2' షూటింగ్ లో బిజీగా ఉన్నారు. ఈ చిత్రంలో బాలీవుడ్ స్టార్ హృతిక్ రోషన్ నటిస్తున్నారు. ఇప్పటికే ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి. ఈ సినిమా తర్వాత స్టార్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ చిత్రం షూటింగ్ లో తారక్ జాయిన్ అవుతారు. ఇప్పటికే ఈ సినిమా ప్రీప్రొడక్షన్ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ సినిమా ద్వారా జూనియర్ ఎన్టీఆర్ ను మరో లెవెల్ కి తీసుకెళ్లేలా పవర్ ఫుల్ స్క్రిప్ట్ ను ప్రశాంత్ నీల్ సిద్ధం చేశారని సమాచారం. సంక్రాంతి సందర్భంగా ఈ సినిమా టైటిల్ ను రివీల్ చేయనున్నట్టు చెపుతున్నారు. మరోవైపు, ఈ చిత్రానికి 'డ్రాగన్' అనే టైటిల్ ను ఫిక్స్ చేసినట్టు విశ్వసనీయ వర్గాల ద్వారా తెలుస్తోంది. సినిమా షూటింగ్ ఫిబ్రవరి లేదా మార్చిలో మొదలు కానున్నట్టు తెలుస్తోంది