ఓటిటి ప్లాట్ ఫామ్ సినిమాలకే కాకుండా, వెబ్ సిరీస్ లకు కూడా మంచి వేదికగా ఉంది. ఈ వెబ్ సిరీస్ లు ఓటిటిలో డైరెక్ట్ గానేస్ట్రీమింగ్ అవుతున్నాయి.18వ శతాబ్దం చివరి అంకంలో జరిగే ఒక స్టోరీతో ఒక వెబ్ సిరీస్ ని చిత్రీకరించారు మేకర్స్. ఈ ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ ఎందులో స్ట్రీమింగ్ అవుతుందో? పేరు ఏమిటో? తెలుసుకుందాం పదండి.ఇప్పుడు మనం చెప్పుకునే ఫ్యామిలీ డ్రామా వెబ్ సిరీస్ పేరు “ది బ్రోకన్ నెస్ట్” (The Broken Nest). ఈ వెబ్ సిరీస్ లో భర్త భార్యను సరిగ్గా పట్టించుకోకపోవడంతో, భార్య మరిదిపై ప్రేమను పెంచుకుంటుంది. ఆ తరువాత మరిది దూరం అవ్వటంతో ఆ అమ్మాయి ఏంచేస్తుందనేది చివరి వరకూ ఈ సిరీస్ చూడాల్సిందే. ఈ వెబ్ సిరీస్ పది ఎపిసోడ్స్ తో ప్రేక్షకులను అలరిస్తోంది. ప్రస్తుతం ఈ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతోంది.
చారులత భూపతి మంచి భార్య భర్తలుగా ఉంటారు. భూపతి కి ఒక పత్రిక నడపాలని కోరికగా ఉంటుంది. అలాగే ఆ ప్రయత్నాన్ని కొనసాగిస్తూ ఒక పత్రికను నడుపుతాడు. ఇందుకోసం తన భార్య అన్నని తోడుగా ఉండటానికి ఇంటికి పిలిపించుకుంటాడు. భూపతి పత్రిక నడపడానికి సమయం ఎక్కువగా కేటాయిస్తూ భార్యను పట్టించుకోకుండా ఉంటాడు. భార్య ఒంటరిగా ఫీల్ అవుతూ ఉంటుంది. ఇంతలో భూపతి తమ్ముడు అమల్ భూపతి ఇంటికి వస్తాడు. అతడు మాటకారి కావడంతో భూపతి భార్య అతనికి ఎక్కువగా అట్రాక్ట్ అవుతుంది. సమయం దొరికినప్పుడల్లా వీళ్ళిద్దరూ మాటలు కలుపుతూ, ఇంట్లో పనులు అన్ని చేసుకుంటూ ఉంటారు. ఈ పరిస్థితుల్లోనే భూపతి భార్య అతన్ని చూడకుండా ఒక నిమిషం కూడా ఉండలేక పోతుంది. మరోవైపు భూపతి తన పత్రికను పూర్తిగా చారులత అన్నకి అప్పగిఇస్తాడు. అతడు మాత్రం ఆ పత్రిక మీద అప్పులు చేసి భూపతికి ఊరికి వెళ్లాలని చెప్పి వెళ్లిపోతాడు.
అప్పుల వాళ్లు భూపతికి త్వరగా అప్పు చెల్లించాలని వార్నింగ్ ఇస్తారు. భూపతి తమ్ముడు చదువు నిమిత్తం లండన్ కి వెళ్ళిపోతాడు. చారులత అమల్ ని తలుచుకుంటూ దిగాలిగా ఉండిపోతుంది. ఇప్పుడు భర్త ఆమెకు సమయాన్ని కేటాయించినా ఆమె నుంచి స్పందన లేకుండా ఉంటుంది. చివరికి చారులత తన మరిది కోసం తపించి ఏమవుతుంది? చారులత అన్న చేసిన అప్పులను భూపతి తీరుస్తాడా? మరిదితో ఈ సంబంధం ఎన్నాళ్లు కొనసాగుతుంది? అనే విషయాలను తెలుసుకోవాలి అనుకుంటే అమెజాన్ ప్రైమ్ వీడియో (Amazon prime video) లో స్ట్రీమింగ్ అవుతున్న “ది బ్రోకన్ నెస్ట్” (The Broken Nest) వెబ్ సిరీస్ ని చూసి ఎంజాయ్ చేయండి. ఈ వెబ్ సిరీస్ ను వీకెండ్ లో ఫ్యామిలీ తో కలసి చూడండి.