ట్రెండింగ్
Epaper    English    தமிழ்

తాండల్ : 15M+ వ్యూస్ ని సొంతం చేసుకున్న బుజ్జి తల్లి సాంగ్

cinema |  Suryaa Desk  | Published : Sat, Nov 30, 2024, 03:55 PM

చందూ మొండేటి దర్శకత్వంలో టాలీవుడ్ యువ సామ్రాట్ నాగ చైతన్య తన తదుపరి ప్రాజెక్ట్ ని ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ సినిమాకి మూవీ మేకర్స్ 'తాండల్' అనే టైటిల్ ని లాక్ చేసారు. ఈ పాన్ ఇండియన్ యాక్షన్ డ్రామా చైతన్య కెరీర్‌లోనే అత్యంత భారీ వ్యయంతో కూడుకున్న ప్రాజెక్ట్. ఈ సినిమా ఫిబ్రవరి 7, 2025న విడుదల కానుంది. ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని బుజ్జి తల్లి అనే టైటిల్ తో మూవీ మేకర్స్ ఇటీవలే విడుదల చేసారు. దేవి శ్రీ ప్రసాద్ కంపోస్ చేసిన ఈ సాంగ్ కి జావేద్ అలీ తన గాత్రాన్ని అందించారు. తాజాగా ఇప్పుడు ఈ సాంగ్ 15 మిలియన్ వ్యూస్ తో యూట్యూబ్ లో టాప్ ట్రేండింగ్ 3 పోసిషన్ లో ఉన్నట్లు సమాచారం. ఈ విషయాన్ని తెలియజేసేందుకు చిత్ర బృందం సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసింది. ఈ చిత్రంలో సాయి పల్లవి కథనాయికగా నటిస్తుంది. గత హిట్‌లలోని వారి కెమిస్ట్రీని గుర్తుచేసుకున్న అభిమానులు, ఆ మ్యాజిక్‌ను పునరావృతం చేస్తారని ఆశిస్తున్నారు. ప్రస్తుతం ఈ చిత్రం నిర్మాణంలో ఉంది. ఈ సినిమాలో ప్రియదర్శి, దివ్య పిళై కీలక పాత్రలలో నటిస్తున్నారు. "తాండేల్" దాని ఆకట్టుకునే కథాంశంతో మరియు దేవిశ్రీ ప్రసాద్ సంగీతంతో భారీ అంచనాలని కలిగి ఉంది. GA2 పిక్చర్స్ క్రింద బన్నీ వాస్ ఈ చిత్రాన్ని నిర్మించారు. ప్రముఖ నిర్మాత అల్లు అరవింద్ ఈ సినిమాని సమర్పిస్తున్నారు. 






SURYAA NEWS, synonym with professional journalism, started basically to serve the Telugu language readers. And apart from that we have our own e-portal domains viz,. https://www.suryaa.com/ and https://epaper.suryaa.com