యువ హీరో మీనాక్షి చౌదరి కెరీర్ హిట్లు ఫ్లాపుల మధ్య సతమతమవుతుంది. అమ్మడు చేసిన సినిమాలు ఎక్కువగా ఫ్లాప్ అవుతున్నాయి. రీసెంట్ గా నెల వ్యవధిలోనే మీనాక్షి సినిమాలు 3 రిలీజ్ అయ్యాయి.వాటిలో లక్కీ భాస్కర్ ఒక్కటి తప్ప మిగతా సినిమాలన్నీ నిరాశపరచాయి. ఐతే హిట్ సినిమా లో మీనాక్షి చేసిన పాత్ర వల్ల ఆమె అసంతృప్తిగా ఉన్నట్టు తెలుస్తుంది.దుల్కర్ సల్మాన్ నటించిన లక్కీ భాస్కర్ సినిమాలో ఆమె వైఫ్, ఇంకా తల్లిగా చేసింది. ఐతే కెరీర్ స్టార్టింగ్ లోనే ఇలా వైఫ్, మదర్ రోల్స్ చేస్తే ఇంక అలాంటి పాత్రలే వస్తాయని మీనాక్షి ఫ్రెండ్స్ భయపెట్టారట. అందుకే ఇక మీదట అలాంటి పాత్రలు చేసేది లేదని తెగేసి చెబుతుంది అమ్మడు.ఐతే క్యారెక్టర్ డిమాండ్ చేయాలే కానీ ఎలాంటి పాత్ర అయినా చేయొచ్చు. అందులో కథ బాగుంటే ఎలాంటి పాత్ర చేసినా ఆడియన్స్ యాక్సెప్ట్ చేస్తారు. ఐతే మీనాక్షి భయపడటంలో కూడా తప్పులేదు. కాకపోతే ఆమె చేసిన సినిమాల్లో ఇలా మదర్ రోల్ చేసిన సినిమా హిట్ అవ్వడంతో ప్రస్తుతం అమ్మడు కన్ ఫ్యూజన్ లో ఉంది.లక్కీ భాస్కర్ తో పాటు మీనాక్షి వరుణ్ తేజ్ మట్కా, విశ్వక్ సేన్ తో మెకానిక్ రాకీ సినిమాల్లో నటించింది. ఐతే ఈ రెండు సినిమాలు బాక్సాఫీస్ దగ్గర ఫెయిల్ అయ్యాయి. లక్కీ భాస్కర్ మాత్రం అటు థియేట్రికల్ రన్ లో 100 కోట్లు సాధించడమే కాదు రీసెంట్ గా ఓటీటీలో రిలీజై అక్కడ అదరగొట్టేస్తుంది.