టాలీవుడ్ పవర్‌స్టార్ పవన్‌కల్యాణ్ పవర్ ప్యాక్డ్ యాక్షన్ థ్రిల్లర్ 'హరి హర వీర మల్లు: పార్ట్ 1 – స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్' లో తదుపరి కనిపించనున్నారు. సినీ ప్రేమికులు ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న ఈ చిత్రంలో పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఒక పీరియాడికల్ ఎంటర్‌టైనర్‌లో నటిస్తున్నాడు. ఈ చిత్రం పాన్ ఇండియా చిత్రంగా విడుదల కానుంది. ఈ చిత్రానికి జ్యోతి కృష్ణ దర్శకత్వం వహిస్తున్నారు. ఎంతో ఆసక్తిగా ఎదురుచూస్తున్న యాక్షన్ ఎపిక్ హరి హర వీర మల్లు పార్ట్-1: స్వోర్డ్ వర్సెస్ స్పిరిట్ షూటింగ్ పునఃప్రారంభం అయ్యింది. ఈ చిత్రం షూటింగ్ చివరి దశకు చేరుకుందని ఈ వారాంతంలో విజయవాడలో చివరి షెడ్యూల్ ప్రారంభం కానుంది. ఈ షెడ్యూల్‌లో, 200 మంది ఆర్టిస్టులతో పవన్ కళ్యాణ్‌తో మరో భారీ సన్నివేశాన్ని చిత్రీకరించడానికి మేకర్స్ ప్లాన్ చేస్తున్నారు మరియు సినిమా షూటింగ్‌ను ముగించనున్నారు. ఈ షెడ్యూల్ లో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ జాయిన్ అయ్యారు. తాజాగా ఇప్పుడు చిత్ర బృందం విజయవాడలోని కనక దుర్గ అమ్మవారిని సందర్శించుకున్నారు. ఈ విషయాన్ని తెలియాజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో బాబీ డియోల్, నిధి అగర్వాల్, విక్రమ్‌జీత్ విర్క్, నోరా ఫతేహి, నర్గీస్ ఫక్రీ, అనుపమ్ ఖేర్ మరియు ఇతర ప్రముఖ నటీనటులు కీలక పాత్రలు పోషిస్తున్నారు. సాంకేతిక బృందంలో సినిమాటోగ్రాఫర్ మనోజ్ పరమహంస, ప్రొడక్షన్ డిజైనర్ తోట తరణి మరియు ఆస్కార్-విజేత స్వరకర్త MM కీరవాణి ఉన్నారు. మెగా సూర్య ప్రొడక్షన్స్ పై AM రత్నం ఈ సినిమాని నిర్మిస్తున్నారు. ఈ చిత్రానికి జ్ఞానశేఖర్ మరియు మనోజ్ కె పరమహంస సినిమాటోగ్రఫీని అందిస్తున్నారు. ఈ చిత్రం మార్చి 28, 2025న విడుదలకి సిద్ధంగా ఉంది.