తెలుగు టాలెంటెడ్ యాక్టర్ సత్య దేవ్ నటించిన 'జీబ్రా' నవంబర్ 22న థియేటర్లలోకి వచ్చింది. ఈ చిత్రంలో కన్నడ నటుడు ధనంజయ ప్రధాన పాత్రలో ఒకరు. లక్ ఫేవర్స్ ది బ్రేవ్ అనేది ఈ సినిమా ట్యాగ్‌లైన్. ఈ మల్టీ స్టారర్‌కి ఈశ్వర్ కార్తీక్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రానికి విడుదలైన అన్ని చోట్ల పాజిటివ్ రివ్యూస్ వస్తున్నాయి. తాజాగా ఇప్పుడు ప్రొడక్షన్ హౌస్ ఈ సినిమా విడుదలైన 10 రోజులలో 11.07 కోట్ల గ్రాస్ ని వాసులు చేసినట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ క్రైమ్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌లో ప్రియా భవానీ శంకర్ మరియు జెన్నిఫర్ పిక్కినాటో మహిళా ప్రధాన పాత్రలు పోషించారు. ప్రముఖ నటుడు సత్యరాజ్, సత్య ఆకల, సునీల్, ప్రియా భవాని శంకర్ ఇతరలు ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తున్నారు. సాంకేతిక బృందంలో రవి బస్రూర్ సంగీతం, సత్య పొన్మార్ సినిమాటోగ్రాఫర్ మరియు అనిల్ క్రిష్ ఎడిటర్‌గా ఉన్నారు. మీరాఖ్ డైలాగ్స్ రాయగా, సుబ్బు స్టంట్స్ చూసుకోగా, అశ్విని ముల్పూరి, గంగాధర్ బొమ్మరాజు కాస్ట్యూమ్స్ డిజైన్ చేశారు. ఈ చిత్రాన్ని పద్మజ ఫిలింస్ ప్రైవేట్ లిమిటెడ్, ఓల్డ్ టౌన్ పిక్చర్స్ బ్యానర్లపై ఎస్ ఎన్ రెడ్డి, ఎస్ పద్మజ, బాల సుందరం, దినేష్ సుందరం నిర్మిస్తున్నారు. ఎస్ శ్రీలక్ష్మి రెడ్డి సహ నిర్మాతగా వ్యవహరిస్తున్నారు. ఈ సినిమాకి కేజీఎఫ్ ఫేమ్ రవి బస్రూర్ సంగీతం సమకూరుస్తున్నారు.