'జైలర్' దర్శకుడు నెల్సన్ నిర్మించిన లేటెస్ట్ తమిళ 'బ్లడీ బెగ్గర్'. కెవిన్ ఇందులో హీరోగా నటించాడు. దీపావళి సందర్భంగా అక్టోబర్ 31న థియేటర్లలో విడుదలైన ఈ ఓ మోస్తరుగా ఆడింది.పెద్దగా కలెక్షన్లు రాకపోయినా కథ కథనాల పరంగా ప్రశంసలు అందుకుంది. అందుకే మరో వారానికే అంటే నవంబర్ 07న తెలుగులో కూడా బ్లడీ బెగ్గర్ రిలీజైంది. అయితే ఇక్కడ పెద్దగా ప్రమోషన్స్ నిర్వహించకపోవడంతో ఈ ను పెద్దగా ఎవరూ పట్టించుకోలేదు. అసలు బ్లడీ బెగ్గర్ తెలుగులో రిలీజైందన్న విషయం కూడా చాలామందికి తెలియదు. కట్ చేస్తే.. ఇప్పుడీ ఓటీటీలోకి వచ్చేసింది. బ్లడీ బెగ్గర్ డిజిటల్ స్ట్రీమింగ్ హక్కులను అమెజాన్ ప్రైమ్ వీడియో సొంతం చేసుకుంది. నవంబర్ 29న తమిళ వెర్షన్ ను మాత్రమే అందుబాటులోకి తీసుకొచ్చారు. తాజాగా తెలుగు వెర్షన్ కూడా స్ట్రీమింగ్ కు తీసుకొచ్చారు. కానీ ఇక్కడే ఓ ట్విస్ట్ ఉంది. అదేంటంటే.. ప్రస్తుతానికి మన దేశంలో తప్పితే మిగతా దేశాల్లో సన్ నెక్స్ట్ ఓటీటీలో బ్లడీ బెగ్గర్ తెలుగు వెర్షన్ స్ట్రీమింగ్ కు వచ్చేసింది. అయితే మరికొన్ని రోజుల్లో భారత్ లోన బ్లడీ బెగ్గర్ తెలుగు డబ్బింగ్ వెర్షన్ ను స్ట్రీమింగ్ చేసే అవకాశముందని తెలుస్తోంది.
శివబాలన్ ముత్తుకుమార్ తెరకెక్కించిన బ్లడీ బెగ్గర్ లో రాధా రవి, రెడిన్ కింగ్ స్లే, పృథ్వీ రాజ్, మిస్ సలీమా, కార్తీక్ తదితరులు ప్రధాన పాత్రలు పోషించారు. జెన్ మార్టిన్ స్వరాలు సమకూర్చారు. ఈ కథ విషయానికొస్తే.. కళ్లు, కాళ్లు లేని వాడిలా నటిస్తూ అందరి దగ్గర డబ్బులు అడుక్కుంటుంటాడు కెవిన్. ఓ రోజు అనుకోకుండా బంగ్లాలోకి వెళ్లి అక్కడే ఇరుక్కుపోతాడు. మరి తర్వాత ఏమైంది? బంగ్లా లో ఉండేవారు ఈ బెగ్గర్ ను ఎందుకు చంపాలనుకున్నారు? చివరకు బతికి బయటపడ్డాడా లేదా అనేదే స్టోరీ.