దీపికా పదుకొణె ఇప్పుడు బాలీవుడ్‌లో నంబర్ 1 స్టార్ హీరోయిన్. ఇక కల్కి తో దక్షిణాదిలోనూ ఆమెకు క్రేజ్ బాగా పెరిగిపోయింది. హాలీవుడ్ ల్లో నటించి మెప్పించిన దీపిక ఇప్పుడు షూటింగులకు కాస్త విరామం ఇచ్చింది.కొన్ని రోజుల క్రితం పండంటి బిడ్డకు జన్మనిచ్చిన ఆమె ఇప్పుడు తన కూతురు ఆలనా పాలనలో బిజీ బిజీగా ఉంటోంది. దీంతో బయట కూడా పెద్దగా కనిపించడం లేదీ అందాల తార. అయితే ఇప్పుడు బెంగుళూరులో గ్రాండ్ లైవ్ కాన్సర్ట్ లో సర్ ప్రైజ్ ఎంట్రీ ఇచ్చింది దీపిక. అంతేకాదు ప్రముఖ సింగర్ దిల్జీత్ దోసాంగ్ కి కన్నడ నేర్పించింది. ప్రముఖ పంజాబీ గాయకుడు దిల్జీత్ దోసాంజ్ దేశమంతా పర్యటస్తున్నాడు. ప్రధాన నగరాల్లో కచేరీలను నిర్వహిస్తున్నాడు. దిల్జీత్ లైవ్ కాన్సర్ట్ టిక్కెట్లు లక్షల్లో అమ్ముడుపోతున్నాయి. ఒక్కో టిక్కెట్టును లక్షకు పైగా బ్లాక్‌లలో విక్రయిస్తున్నారు. ఇప్పుడు ఇండియాలో 'దిల్లుమినాటి' టూర్ కొనసాగుతోంది.ఇందులో భాగంగా శుక్రవారం (డిసెంబర్ 06) బెంగళూరులో దిల్జీత్ గ్రాండ్ కాన్సర్ట్ జరిగింది.
దిల్జీత్ బెంగళూరు సంగీత కచేరీకి భారీ సంఖ్యలో అభిమానులు హాజరయ్యారు. దిల్జీత్ తన ప్రతి కచేరీలో ఒక ప్రత్యేక అతిథిని వేదికపైకి తీసుకువస్తాడు. విదేశాల్లో ప్రదర్శనలు ఇచ్చేటప్పుడు హాలీవుడ్ తారలను వేదికపైకి అతిధులుగా తీసుకొచ్చాడు దిల్జీత్ దోసాంజ్. శుక్రవారం బెంగుళూరులో షో జరిగినప్పుడు.. కొందరు కన్నడ సినీ తారలను దిల్జీత్ వేదికపైకి తీసుకొస్తాడని అంతా అనుకున్నారు. కానీ దిల్జీత్ దోసాంజ్ మాత్రం దీపికా పదుకొణెని సర్ ప్రైజ్ గెస్ట్ గా తీసుకొచ్చాడు. దీపికా పదుకొనే వేదికపైకి వచ్చి దిల్జీత్ దోసాంజ్‌కి కన్నడ నేర్పింది. దీపికా పదుకొణె వేదికపైకి రాగానే దిల్జీత్ కన్నడలో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. కానీ సరిగ్గా మాట్లాడలేకపోయాడు. దీంతో దీపికా పదుకొణె కన్నడలో 'ఐ లవ్ యూ' అని చెప్పగా, దిల్జీత్ దోసాంజ్ కూడా అలాగే చెప్పాడు.
కాగా దీపికా పదుకొణె బెంగళూరు అమ్మాయి, ఆమెకు కన్నడ భాష బాగా తెలుసు. ఆమె బెంగళూరులోని తన ఇంటికి వచ్చినప్పుడు కన్నడలో మాత్రమే మాట్లాడుతుందట. అంతేకాదు తన సహనటులకు కూడా కన్నడ నేర్పించిందట. 'చెన్నై ఎక్స్‌ప్రెస్' సమయంలో షారూఖ్‌కి కన్నడ నేర్పింది దీపిక. ఆమె తన భర్త రణవీర్ సింగ్‌కి కూడా కన్నడ నేర్పింది.