బాలీవుడ్ ప్రముఖ నటి మలైకా అరోరా తన వ్యక్తిగత జీవితానికి సంబంధించి నిత్యం వార్తల్లో నిలుస్తూనే ఉంటుంది. నటుడు అర్జున్ కపూర్‌తో విడిపోయిన తర్వాత, ఒక 'మిస్టరీ మ్యాన్'తో తెగ చక్కర్లు కొడుతోందీ అందాల తార.ఇటీవల ఇద్దరూ చేతులు పట్టుకుని రెస్టారెంట్ నుండి బయటికి వస్తూ కనిపించారు. ఆ తర్వాత మలైకా ఇటీవలే సింగర్ ఎ. పి. ధిల్లాన్ సంగీత కచేరికి హాజరైంది. ఈ కచేరీలో, మలైకా మళ్లీ అదే మిస్టరీ మ్యాన్ తో కనిపించింది. ఇంతకీ ఆ మిస్టరీ మ్యాన్ ఎవరో తెలుసా.. అతని పేరు రాహుల్ విజయ్. ఈ కచేరీలో మలైకాను వేదికపైకి ఆహ్వానించారు. ఎ. పి. ధిల్లాన్ ఆమె కోసం ఒక ప్రత్యేక పాట పాడారు. అంతేకాదు మలైకా తన చిన్ననాటి క్రష్ అని అందరికీ ప్రకటించాడు. ఆ తర్వాత ఇద్దరూ వేదికపై ఒకరినొకరు కౌగిలించుకున్నారు. ఆ తర్వాత ప్రియుడు రాహుల్ విజయ్‌తో కలిసి దిగిన సెల్ఫీని షేర్ చేసింది మలైకా. దీంతో వీరిద్దరి ఫోటో సోషల్ మీడియాలో తెగ వైరలవుతోంది. దీంతో మలైకా మళ్లీ ప్రేమలో పడిందని బాలీవుడ్ మీడియా కోడై కూస్తోంది.
కాగా ఇటీవల తన ప్రమోషన్స్‌లో అర్జున్ కపూర్ తాను ఒంటరిగా ఉన్నానని వెల్లడించాడు. అయితే మలైకాకు అర్జున్ ఎందుకు దూరంగా ఉన్నాడో ఇంకా తెలియరాలేదు. మరోవైపు మలైకా తన ఇన్‌స్టా స్టోరీలో కొన్ని ఫన్నీ పోస్ట్‌లను షేర్ చేస్తోంది. అర్బాజ్ ఖాన్ విడాకుల తర్వాత 2018లో మలైకా అర్జున్‌తో డేటింగ్ ప్రారంభించింది. వీరిద్దరు తరచుగా కలిసి కనిపించేవారు. అయితే 2019లో, వారు సోషల్ మీడియాలో తమ సంబంధాన్ని బహిరంగంగా అంగీకరించారు ఏజ్ గ్యాప్ కారణంగా వీరిద్దరూ చాలాసార్లు ట్రోల్‌కు గురయ్యారు. అయితే ఈ ట్రోలింగ్ ఉన్నప్పటికీ, వారు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. బ్రేకప్ తర్వాత మలైకా కష్ట సమయంలో అండగా నిలిచాడు. సెప్టెంబర్‌లో మలైకా తండ్రి ఆత్మహత్య చేసుకున్నాడు. ఆ సమయంలో మలైకాను ఓదార్చడానికి అర్జున్ వచ్చాడు.