కోలీవుడ్ స్టార్ నటుడు అజిత్ తన తదుపరి చిత్రాన్ని డైరెక్టర్ మాగిస్హ్ తిరుమేనితో ప్రకటించిన సంగతి అందరికి తెలిసిందే. ఈ యాక్షన్ డ్రామాకి 'విదా ముయార్చి' అనే టైటిల్ ని లాక్ చేసారు. సినిమా యొక్క అద్భుతమైన అజర్‌బైజాన్ ల్యాండ్‌స్కేప్ మరియు మగిజ్ తిరుమేని యొక్క అసాధారణమైన కథా నైపుణ్యాల గురించి ఒక సంగ్రహావలోకనం అందిస్తూ ఈ సినిమా యొక్క అత్యంత అంచనాలతో కూడిన టీజర్ విడుదల చేయబడింది. అజిత్ కుమార్ తన సన్నివేశాలకు డబ్బింగ్ పూర్తి చేసారు. లేటెస్ట్ రిపోర్ట్స్ ప్రకారం, ఈ సినిమా నుండి ఫస్ట్ సింగల్ ని త్వరలో విడుదల చేయనున్నట్లు వార్తలు వినిపిస్తున్నాయి. దీనికి సంబందించిన అప్డేట్ ని మూవీ మేకర్స్ త్వరలో వెల్లడి చేయనున్నట్లు లేటెస్ట్ టాక్. ఈ సినిమాలో స్టార్ హీరోయిన్ త్రిష కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాలో అర్జున్, రెజీనా కసాండ్రా, బిగ్ బాస్ అరవ్, నిఖిల్ నాయిర్, సంజయ్ సారా కీలక పాత్రల్లో నటిస్తున్నారు. అనిరుధ్ రవిచందర్ సంగీతం సమకూరుస్తుండగా, లైకా ప్రొడక్షన్స్ ఈ ప్రాజెక్ట్‌ని నిర్మిస్తోంది.