విక్టరీ వెంకటేష్ ప్రస్తుతం తన ఫ్యామిలీ ఎంటర్టైనర్ 'సంక్రాంతికి వస్తున్నాం' సినిమాతో బిజీగా ఉన్నాడు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా శరవేగంగా షూటింగ్ జరుపుకుంటోంది. ఈ చిత్రం 14 జనవరి 2024న గ్రాండ్ రిలీజ్ కోసం రేసులో ఉంది. ఈలోగా, మేకర్స్ ప్రధాన తారాగణంపై ముఖ్యమైన సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. ఆర్‌ఎఫ్‌సిలో అందంగా వేసిన సెట్‌లో మేకర్స్ ఫ్యామిలీ, ఎమోషనల్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నట్లు ఇన్‌సైడ్ టాక్. వెంకటేష్‌తో పాటు ఇతర నటీనటులు షూటింగ్‌లో పాల్గొంటున్నారు. ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజష్ కథానాయికలుగా నటించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని గోదారి గట్టు అనే టైటిల్ తో విడుదల చేసారు. రమణ గోగుల మరియు మధు ప్రియ పాడిన ఈ రొమాంటిక్ ట్రాక్ సూపర్ హిట్ గా నిలిచింది. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. దిల్ రాజు ప్రతిష్టాత్మకంగా సమర్పిస్తున్న ఈ చిత్రాన్ని అల్లు శిరీష్ నిర్మిస్తున్నారు.