విక్టరీ వెంకటేష్ రాబోయే ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ సంక్రాంతికి వస్తున్నామ్ సంక్రాంతి పండుగ సందర్భంగా 14 జనవరి 2025న అద్భుతమైన విడుదల కోసం రేసులో ఉంది. అనిల్ రావిపూడి దర్శకత్వం వహించిన ఈ చిత్రంలో మీనాక్షి చౌదరి మరియు ఐశ్వర్య రాజష్ కథానాయికలుగా నటించారు. ఇటీవలే మూవీ మేకర్స్ ఈ సినిమాలోని ఫస్ట్ సింగల్ ని గోదారి గట్టు అనే టైటిల్ తో విడుదల చేయగా ఈ రొమాంటిక్ ట్రాక్ సూపర్ హిట్ గా నిలిచింది. తాజాగా చిత్ర బృందం ఈ సినిమా యొక్క సెకండ్ సింగల్ ప్రోమోని మీను అనే టైటిల్ తో రేపు ఉదయం 10:08 గంటలకి విడుదల చేననున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని తెలియజేసేందుకు మూవీ మేకర్స్ సోషల్ మీడియాలో సరికొత్త పోస్టర్ ని విడుదల చేసారు. ఈ చిత్రంలో ఉపేంద్ర లిమాయే, రాజేంద్ర ప్రసాద్, సాయి కుమార్, నరేష్, VT గణేష్, మరియు మురళీధర్ గౌడ్ కీలక పాత్రలలో నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంగీతం భీమ్స్ సిసిరోలియో స్వరాలు సమకుర్చారు. శ్రీ వెంకటేశ్వర క్రియేషన్స్ బ్యానర్‌పై దిల్ రాజు ఈ ప్రాజెక్టును నిర్మిస్తున్నారు.