హైదరాబాద్‌లోని సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన నటుడు అల్లు అర్జున్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది.జైలు నుంచి విడుదలైన ఆయన్ని చిత్ర పరిశ్రమకు చెందిన దర్శక-నిర్మాతలు, హీరోలు కలిసి పరామర్శించారు. నేడు మెగాస్టార్ చిరంజీవి ఇంటికి అల్లు అర్జున్ వెళ్తున్నట్లు తెలుస్తోంది. అరెస్ట్ తర్వాత జరిగిన పరిణామాలను చిరంజీవికి అల్లు అర్జున్ వివరించే అవకాశముంది. కాగా మొన్న అల్లు అర్జున్ అరెస్ట్ కాగానే చిరు తన షూటింగ్ క్యాన్సిల్ చేసుకొని ఆయన ఇంటికి వెళ్లి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. నిన్న జైలు నుంచి బన్నీ విడుదలైన తర్వాత మెగాస్టార్ సతీమణి సురేఖ అల్లు అరవింద్ ఇంటికి వెళ్లిన విషయం తెలిసిందే. అయితే అల్లు అర్జున్ తన భార్య స్నేహా రెడ్డి, పిల్లలతో కలిసి అల్లు అర్జున్ ఇంట్లో లంచ్‌కి బయల్దేరినట్లు సమాచారం.సంధ్య థియేటర్ తొక్కిసలాట ఘటనపై అరెస్టై.. బెయిల్‌పై విడుదలైన నటుడు అల్లు అర్జున్‌కు సినీ పరిశ్రమ నుంచి మద్దతు లభిస్తోంది. ఈ క్రమంలోనే శనివారం రాత్రి హైదరాబాద్‌కు వచ్చిన ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అల్లు అర్జున్‌ను కలుస్తారని ప్రచారం జరిగింది. అయితే అల్లు అర్జున్‌ను పవన్ కలవకుండానే నేడు తిరిగి విజయవాడ వెళ్లినట్లు తెలుస్తోంది.
ఇప్పటికే మెగా, అల్లు కుటుంబాల మధ్య కోల్డ్ వార్ నడుస్తోందని ఫ్యాన్స్ అంటున్నారు. ఏపీ ఎన్నికల సమయంలో అల్లు అర్జున్ జనసేనను కాదని వైసీపీ నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్పా రవి రెడ్డిని సపోర్ట్ చేయడంతో మెగా అభిమానులు బాగా హార్ట్ అయ్యారు. ఈ క్రమంలోనే ఆయన్ను మెగా ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ట్రోల్ చేయడం మొదలుపెట్టారు. ఆడపాదడపా నాగబాబు కూడా అల్లు అర్జున్‌కు తగిలేటట్లు ట్వీట్‌లు కూడా వేశారు. ఇక పుష్ప-2 మూవీ విడుదల సమయంలో అభిమానులు సినిమాను సినిమాలాగే చూడాలని నాగబాబు పిలుపునివ్వడంతో ఈ వార్ నిజమేనని అర్థమైంది. ఇక తాజాగా జరిగిన పరిణామాల నేపథ్యంలో అల్లు అర్జున్.. మెగాస్టార్ ఇంటి వెళ్తుండటంతో మెగా వర్సెస్ అల్లు అనే ట్యాగ్‌కు చెక్ పడనుందని అభిమానులు కామెంట్లు పెడుతున్నారు.