బతికున్నప్పడు ఎవరైనా సంపాదిస్తారు. కానీ కొందరు సెలబ్రిటీష్ చనిపోయిన తర్వాత కూడా డబ్బు సంపాదిస్తున్నారు. అది ఎలా అని ఆలోచిస్తున్నారా.. దానిని రాయలిటీ అంటారు. ఉదాహరణకు మైఖేల్ జాక్సన్, ఎల్విస్ ప్రెస్లీ, ప్రిన్స్, జేమ్స్ డీన్ వంటి ప్రముఖులు మరణించిన తర్వాత కూడా రూ. వేల కోట్లు సంపాదిస్తున్నారు. మ్యూజిక్ పబ్లిషింగ్ రైట్‌లు, కాపీరైటులు లేదా ఫోటో-షూట్లు, సినిమా ప్రొడక్షన్ ద్వారా వారి కుటుంబాలు ఇన్‌కమ్ పొందుతున్నాయి.