సిద్ధు జొన్నలగడ్డ కథానాయకుడిగా తెరకెక్కుతున్న 'జాక్' ఈ సినిమాకి 'బొమ్మరిల్లు' భాస్కర్ భాస్కర్ దర్శకత్వం వహిస్తున్నాడు. హీరోయిన్ గా 'బేబీ' ఫేమ్ వైష్ణవీ చైతన్య నటిస్తున్నారు. శ్రీ వెంకటేశ్వర సినీ చిత్ర పతాకంపై బీవీఎస్‌ఎన్ ప్రసాద్ నిర్మిస్తున్న ఈ సినిమా చిత్రీకరణ 80శాతంపైనే పూర్తయింది. ఈ చిత్రాన్ని ఏప్రిల్ 10న రిలీజ్ చేయనున్నట్లుగా వెల్లడించి, కొత్త పోస్టర్స్‌ను రిలీజ్ చేశారు మేకర్స్. ''జాక్' పూర్తి వినోదాత్మక చిత్రం. సిద్ధు పాత్ర అలరించేలా ఉంటుంది'' అని చిత్రయూనిట్ పేర్కొంది. ఈ సినిమాకు సంగీతం: అచ్చు రాజమణి.